Adult Diaper: అది డైపర్‌ రా బాబు..బాంబు అని హడలిపోయి విమానం ఆపేశారు

విమానం (Flight) టాయిలెట్‌ (toilet)  లో కనిపించిన అడల్ట్‌ డైపర్‌ ..ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని అత్యవసరంగా కిందకి (Emergency landing) దింపింది. బాత్రూంలో కనిపించిన డైపర్‌ కాసేపు సిబ్బందిని, ప్రయాణికులను అందరినీ గందరగోళానికి గురి చేసింది.

New Update
Adult Diaper: అది డైపర్‌ రా బాబు..బాంబు అని హడలిపోయి విమానం ఆపేశారు

విమానం (Flight) టాయిలెట్‌ (toilet)  లో కనిపించిన అడల్ట్‌ డైపర్‌ ..ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని అత్యవసరంగా కిందకి (Emergency landing) దింపింది. బాత్రూంలో కనిపించిన డైపర్‌ కాసేపు సిబ్బందిని, ప్రయాణికులను అందరినీ గందరగోళానికి గురి చేసింది. కొందరు పెద్దవారు ఆరోగ్య పరిస్థితులు బాగోని నేపథ్యంలో ఈ అడల్ట్‌ డైపర్‌ లను ఉపయోగిస్తుంటారు.

అమెరికా(America) లోని పనామా సిటీ (Panama) నుంచి ఫ్లోరిడా(Flourida)లోని తంపాకు బయల్దేరిన విమానంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రయాణికులందరిని కిందకు దించి, విమానాన్ని మొత్తం జల్లెడ పట్టాగా అందులో ఏమి లేదని నిర్థారించుకున్న తరువాత విమానం మళ్లీ బయల్దేరి వెళ్లింది. కోపా ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన విమానం పనామా సిటీ నుంచి ఫ్లోరిడా కు బయల్దేరింది.

Also read: అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు…అంతలోనే అనుకోని ఆపద

విమానం టేకాఫ్‌ అయిన గంట తరువాత విమానంలోని టాయిలెట్‌ లో ఓ ప్రయాణికుడికి ఓ అనుమానస్పద వస్తువు కనిపించింది. దాని గురించి విమాన సిబ్బందికి సమాచారం అందించాడు. దాంతో వారు దానిని చూసి బాంబుగా భావించి భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం గురించి పైలట్‌ దృష్టికి తీసుకుని వెళ్లారు.

వెంటనే ఆయన విమానాశ్రయా సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పాటు ఆయన విమానాన్ని వెనక్కి తిప్పేశారు. మళ్లీ పనామాలోనే అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానంలోని 144 మంది ప్రయాణికులను కిందికి దించి విమానంలో బాంబ్‌ స్క్వాడ్‌ గాలింపు చేపట్టింది. టాయిలెట్‌ లో గుర్తించిన అనుమానాస్పద వస్తువును అడల్ట్‌ డైపర్‌ గా గుర్తించడం జరిగింది.

దీంతో ఒక్కసారిగా విమాన సిబ్బంది , ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో విమానం మళ్లీ తిరిగి ఫ్లోరిడాకు బయల్దేరింది.

Also read: ట్రైన్‌ జర్నీ చేసేవారికి గుడ్‌ న్యూస్‌..దసరాకు 620 స్పెషల్‌ ట్రైన్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు