/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T164748.164.jpg)
Prabhas Spirit Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ - సెన్సేషనల్ డైరెక్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'స్పిరిట్'. ఈ ప్రాజెక్ట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేసేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
గతంలో కత్రినా కైఫ్ (Katrina Kaif), దీపికా పదుకొనె (Deepika Padukone), త్రిప్తి దిమ్రి (Tripti Dimri) వంటి హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. కానీ లేటెస్ట్ టాక్ప్రకారం సినిమాలో త్రిషను కథానాయికగా ఖరారు చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఈ విషయంలో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. కాగా ప్రభాస్, త్రిష కాంబినేషన్‌లో ఇప్పటికే 'వర్షం', 'పౌర్ణమి' వంటి సూపర్‌హిట్ చిత్రాలు వచ్చాయి.
Also Read : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
మళ్లీ ఈ జంటను తెరపై చూడాలనే కోరిక ప్రేక్షకుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే 'స్పిరిట్'లో త్రిషను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది.