Actor Ali: వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన ఆలీ.. సంచలన వీడియో విడుదల!

సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. రాజకీయాలకు ఇక సెలవు. ఇక నుంచి సినిమాలే చేస్తానంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు అలీ.

author-image
By srinivas
New Update
Actor Ali: వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన ఆలీ.. సంచలన వీడియో విడుదల!

AP News: సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు. రాజకీయాలకు ఇక సెలవు. ఇక నుంచి సినిమాలే చేస్తానంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ మేరకు అలీ మాట్లాడుతూ.. బాలనటుడిగా రాణించిన తర్వాత.. నా సెకండ్ ఇన్నింగ్స్‌కి అవకాశం ఇచ్చిన రామానాయుడు కోసమే 1999లో రాజకీయాల్లో అడుగు పెట్టాను. రామానాయుడు బాపట్లలో ఎంపీగా నిలబడినట్లు వచ్చి ప్రచారం చేయాలని కోరడంతోనే టీడీపీలో చేరాను. 20 ఏళ్లు టీడీపీలో కొనసాగి.. తర్వాత వైసీపీలో చేరాను. నాకు అన్నం పెట్టింది తెలుగు పరిశ్రమ. 45 ఏళ్లుగా 6 భాషల్లో 1200 పైచిలుకు సినిమాల్లో నటించాను. నాకు సాయం చేసే గుణం ఉంది. దానికి రాజకీయ బలం తోడైతే.. మరింత సేవే చేయవచ్చనే ఉద్దేశంతోనే పాలిటిక్స్‌లోకి వచ్చాను. నేను ఉన్న పార్టీల్లో నాయకులను పొగిడాను తప్పితే.. ప్రతిపక్ష పార్టీల్లోని నాయకులను ఎప్పుడూ తిట్టలేదు. ఇకపై రాజకీయాలకు మొత్తం దూరంగా ఉంటానంటూ చెప్పుకొచ్చాడు.

2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అలీ..పార్టీ కోసం బాగానే కష్టపడ్డాడు. అయితే ఆయనకు పలు పదవులు ఇస్తున్నట్లు ప్రచారం జరిగినా.. చివరికీ ఏవీ దక్కలేదు. దీంతో 2022లో అలీని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో అయినా తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు వస్తుందని భావించారు అలీ. కానీ ఆ ఆశ నెరవేరలేదు. అయితే అలీ కూటమిలో చేరబోతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment