Rajastan: వంద మందిని రేప్ చేసిన నిందితులకు యావజ్జీవ జైలు శిక్ష రాజస్థాన్‌లోని అజ్మైర్‌లో వంద మంది అమ్మాయిలను రేప్ చేసిన నిందితులకు ఎట్టకేలకు శిక్ష పడింది. 1992లో వంద మంది కాలేజీ అమ్మాయిలను గ్యాంగ్ రేప్ చేసిన 18 మంది నిందితుల్లో ఆరుగురికి అజ్మైర్ ప్రత్యేక కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. దాంతో పాటూ 5 లక్షల జరిమానా కూడా విధించింది. By Manogna alamuru 20 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Gang Rape Verdict: రాజస్థాన్‌లోని అజ్మైర్‌లో 1992లో జరిగిన సంఘటన దేధ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 100 మంది కాలేజీ అమ్మాయిలు గ్యాంగ్ రేప్ కు గురైయ్యారు. దాంతో పాటూ వారి నగ్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. మొత్తం 18 మంది ఈ గ్యాంగ్ రేప్ వెనుక ఉన్నారు. ఈ కేసు మీద విచారణ ఇన్నాళ్లుగా కొనసాగుతూనే ఉంది. బాధితులు అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళకి దీని మీద తీర్పు వెలువడింది. అజ్మైర్‌లోని స్పెషల్ కోర్టు ఈ గ్యాంగ్ రేప్ కేసు నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పును చేప్పింది. దాంతో పాటూ నిందితులు ఒక్కొక్కొరూ 5 లక్షల జరిమానా కూడా కట్టాలని ఆదేశించింది. అయితే ఈ గ్యాంగ్ రేప్ కేసులో మొత్తం 18 మంది దోషులుగా తేలారు. కానీ ప్రస్తుతం వారిలో ఆరుగురికి మాత్రమే కోర్టు శిక్ష విధించింది. ఎందుకంటే 18 మందిలో ఒకరు సంఘటన జరిగిన వెంటనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మరో ఇద్దరి మీద అక్రమాస్తులు కేసు నమోదైంది. వారు దానిలో శిక్స అనుభవిస్తున్నారు. ఇంకుకు పరారీలో ఉన్నారు. పారిపోయిన వ్యక్తి ఇప్పటికీ దొరకలేదు. మరో నలుగురు ఇప్పటికే శిక్ష అనుభవించి విడుదల అయ్యారు కూడా. దాంతో మిగిలిన ఆరుగురికి అజ్మైర్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును చెప్పింది. Also Read: Maharashtra: ఏడు గంటలుగా రైలు ట్రాక్ పైనే..ఉరి తీసే వరకు అంటూ నిరసనలు #rajasthan #gang-rape #verdict #ajmer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి