Hyderabad: రూ.65 లక్షల నిధులు మళ్లించిన అధికారిణి అరెస్టు నగర చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అధికారని అనిశెట్టి శ్రీదేవిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్టు చేశారు. 322 అంగన్‌వాడి కేంద్రాలకు సంబంధించి దాదాపు రూ.65.78 లక్షల నగదును దారి మళ్లించినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. By B Aravind 29 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడటం, నిధులు మళ్లించడం లాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నగర చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అధికారని అనిశెట్టి శ్రీదేవిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్టు చేశారు. శ్రీదేవి ఆదిలాబాద్ జిల్లాలోని జైనూరులో గతంలో సీడీపీవోగా పనిచేసిన సమయంలో నిధులు మళ్లించినట్లు గుర్తించామని తెలిపారు. ఆరోగ్యలక్ష్మీ పాల సరఫరా ఖర్చులపై.. ఫేక్ ఇండెంట్లను సృష్టించి సొమ్ము కాజేసినట్లు తేల్చామని పేర్కొన్నారు. మొత్తం 322 అంగన్‌వాడి కేంద్రాలకు సంబంధించి దాదాపు రూ.65.78 లక్షల నగదును దుర్వినియోగం చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. Also read: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు అస్వస్థత ఏసీబీకి చిక్కిన మరో అధికారిణి మరోవైపు తెలంగాణ గిరిజన సంక్షేమ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జగజ్యోతి అనే మహిళ.. కాంట్రక్టర్ నుంచి రూ.84 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. నిజామాబాద్ జిల్లాలోని అభివృద్ధి పనుల కోసం బిల్లులు మంజూరు చేసేందుకు గాజుల రామారంలోని బాలల సంరక్షణ గృహనిర్మాణ పనులు అప్పగించేందుకు గంగాధర్ అనే కాంట్రక్టర్ నుంచి డబ్బులు డిమాండ్ చేసింది. చివరకి అతడు ఏసీబీని ఆశ్రయించడంతో ఆమె అధికారులకు దొరికిపోయింది. ఇటీవల రెరా కార్యదర్శి బాలకృష్ణ అరెస్టు ఇదిలాఉండగా ఇటీవల తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి ఎస్.బాలకృష్ణ వద్ద కూడా రూ.100 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడటం రాష్ట్రంలో సంచనలం రేపిన సంగతి తెలిసిందే. ఆయన్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. హెచ్‌ఎండీఏ పరిధి జోన్లలో ఉన్న నిబంధనల్ని ఆసరాగా చేసుకొని.. తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని వందల దరఖాస్తులకు ఆమోదం తెలిపేందుకు భారీగా వసూలు చేసినట్లు ఆయనపై అభియోగాలు వచ్చాయి. Also read: గురుకుల జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదల..! #telugu-news #acb #hyderabad-news #bribe మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి