MEA: రష్యా సైన్యంలో 20-30 మంది భారతీయులు చిక్కుకుపోయారు: విదేశాంగ శాఖ ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. రష్యా కోసం సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడిపించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇంకా 20 నుంచి 30 మంది భారతీయులు రష్యా సైన్యం వద్ద చిక్కుకుపోయారని పేర్కొన్నారు. By B Aravind 29 Feb 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి రెండేళ్ల క్రితం రష్యా-ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. వేలాది మంది ఇరుదేశాల పౌరులు ఈ భీకర వాతావరణ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కూడా ఎక్కడో ఓ చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో.. రష్యా సైన్యం వైపు కొంతమంది భారతీయులు కూడా పనిచేస్తున్నారు. వీళ్లని విడిపించడం కోసం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇంకా 20 నుంచి 30 మంది భారతీయులు రష్యా సైన్యం వద్ద చిక్కుకుపోయారని.. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. Also Read: ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులే: సుప్రీంకోర్టు 20-30 మంది భారతీయులు చిక్కుకుపోయారు ఉక్రెయిన్‌తో యుద్ధం చేసేందుకు రష్యా సైన్యం వద్ద సహాయకులుగా ఉండేందుకు కొంతమంది భారతీయులు పనిచేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని రణధీర్ జైస్వాల్ తెలిపారుయ. దీంతో వారిని విడిపించేందుకు తాము ప్రయత్నాలు మొదలుపెట్టామని.. ఇప్పుడు కూడా మాస్కోలోని రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నామని చెప్పారు. అయితే ఇంకా 20 నుంచి 30 మంది అక్కడ చిక్కుకపోయారని తెలిసిందని.. వాళ్లని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అంతేకాదు భారతీయులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భూమిలోకి వెళ్లొద్దని సూచనలు చేశారు. ఇటీవలే భారతీయుడు మృతి ఇదిలా ఉండగా.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఓ భారతీయుడు మృతి చెందినట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. రష్యా ఆక్రమిత ప్రాంతమైన డొనెట్స్‌లో ఫిబ్రవరి 21న ఉక్రెయిన్ క్షిపణి దాడులు జరిపింది. ఈ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన హేమిల్ అశ్విన్‌భాయ్‌గా అధికారులు గుర్తించారు. అతడు 2023 డిసెంబర్‌లో రష్యాకు వెళ్లాడు. ఆ తర్వాత రష్యా సైన్యంలో పనిచేసేందుకు కాంట్రాక్టుపై సంతకం చేశాడు. చివరికి క్షిపణి దాడులో మరణించాడు. Also Read: ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్ లేక వృద్ధుడు మృతి.. ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా #telugu-news #national-news #russia-ukraine-war మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి