Aishwarya Rai : విడివిడిగా అంబానీ పెళ్లికి.. అభిషేక్-ఐశ్వర్య విడాకులపై నెట్టింట రచ్చ!

New Update
Aishwarya Rai : విడివిడిగా అంబానీ పెళ్లికి.. అభిషేక్-ఐశ్వర్య విడాకులపై నెట్టింట రచ్చ!

Abhishek - Aishwarya : బాలీవుడ్ (Bollywood) నటులు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) విడాకుల ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది. కొంత కాలంగా వీరిద్దరి మధ్య సఖ్యత లేదని, విడివిడిగా ఉంటున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసింతే. కాగా రీసెంట్ గా అనంత్ అంబానీ పెళ్లికి కూతురితో ఐశ్వర్యరాయ్, తండ్రి అమితాబ్, తల్లి, సోదరితో అభిషేక్ హాజరుకావడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు అనంత్ - రాధిక మర్చంట్ (Anant Ambani - Radhika Merchant) వివాహ వేడుకలో అభిషేక్, ఐశ్వర్య పక్కపక్కనే కూర్చున్నప్పటికీ దంపతులు మాట్లాడుకోకపోవడం విశేషం. ఐశ్వర్యరాయ్ కేవలం తన కూతురితోనే ఉత్సాహంగా ముచ్చటించింది. అయితే ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అభిషేక్ సల్మాన్ ఖాన్, ధోనీ అతిథులను పలకరిస్తూ కనిపించారు. అయితే ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ జంటను మాత్రం జూమ్ చేసి చూపించడంతో ఆసక్తికరంగా మారింది. కెమెరాను చూసి ఐశ్వర్యరాయ్ స్మైల్ ఇవ్వడం విశేషం. కాగా అభిషేక్, ఐశ్వర్య విడిపోవడం లేదని ఈ వీడియోతో క్లారిటీ వచ్చిందని చాలా మంది అంటున్నారు. అయితే అభిషేక్ ఐశ్వర్యతో మాట్లాడకపోవడాన్ని కొంతమంది పాయింటవుట్ చేస్తున్నారు.

Also Read : మణిపూర్‌లో మరోసారి కాల్పులు.. జవాన్ మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

మెగా ఫ్యాన్స్ కు రేపు నిజంగానే పండుగ రోజు. అసలే రేపు శ్రీరామ నవమి...దానికి తోడు చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా గ్లింప్స్ ను ఉదయం 11.45 గంటలకు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ గ్లింప్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

New Update
peddi ram charan look

peddi ram charan look

గేమ్ ఛేంజర్ తర్వాత అందరూ ఆసక్తి చూస్తున్న రామ్ చరణ్ సినిమా పెద్ది. ఇప్పటికే చరణ్ ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై హైప్స్ పెంచేసిన మూవీ దర్శకుడు బుచ్చిబాబు తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తానంటూ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ దీని కోసం ఆతృతగా ఎదురు చేస్తున్నారు. 

పెద్ది గ్లింప్స్ పై క్రేజీ పోస్ట్ లు..

టైటిల్ ఎంత క్రేజీగా ఉందో ఇందులో చరణ్ లుక్ కూడా అంతే క్రేజీగా చాలా మాస్ అండ్ రస్టిక్ ఉంది. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో చరణ్ లుక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. 'ఉప్పెన' తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకొని ఈ కథను సిద్ధం చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ పాన్ ఇండియా మూవీకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పుడు గ్లింప్స్ శ్రీరామ నవమి రోజు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పెద్ది' మూవీ గ్లింప్స్ ని ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేయనున్నారు. రేపు (ఏప్రిల్ 6) ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. దీనిపై తాజాగా రామ్ చరణ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.  గ్లింప్స్ చూసిన తర్వాత సూపర్ ఉత్సాహంగా ఉంది. ఇది మీకు కూడా చాలా నచ్చుతుంది అంటూ అందులో రాశారు. ఈ సందర్భంగా ఓ వీడియోని కూడా షేర్ చేసారు. దీనిపై బుచ్చిబాబు రియాక్ట్ అవుతూ ఏఆర్ రెహమాన్, చరణ్ అదరగొట్టారనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు.

 

 today-latest-news-in-telugu 

 Also Read: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

Advertisment
Advertisment
Advertisment