ఆమె కడుపున నువ్వు ఎలా పుట్టావురా.. అడిగింది ఇవ్వలేదని తల్లినే..

రూ.5,000 కోసం ఓ యువకుడు తల్లిని గొంతు పిసికి చంపేసిన దారుణమైన ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. హిమాన్షు తన తల్లి ప్రతిమా దేవిని హతమార్చి డెడ్ బాడీని ట్రావెల్‌ బ్యాగ్‌లో కుక్కి హర్యానా నుంచి త్రివేణి సంగమం నదిలో పడేసేందుకు తీసుకొచ్చాడు. స్థానికులు పోలీసులకు పట్టించారు.

New Update
ఆమె కడుపున నువ్వు ఎలా పుట్టావురా.. అడిగింది ఇవ్వలేదని తల్లినే..

Bihar : నవమాసాలు మోసి, కని పెంచిన తల్లి పాలిటే యముడు అయ్యాడు ఓ కొడుకు. తను అడిగింది ఇవ్వలేదని మాతృమూర్తిపట్ల కర్కశంగా వ్యవహరించాడు. కృర మృగంలా మారి తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశాడు. అంతటితో ఆగకుండా ఆమె శవాన్ని వందల కిలోమీటర్ల దూరంలో పడేసి, ఎవరికీ అనుమానం రాకుండా మిస్సింగ్ కేసు పెట్టేందకు ప్లాన్ చేశాడు. కానీ ఆ దుర్మార్గుడి బాగోతం ఊహించని విధంగా బయటపడటంతో చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ దారుణమైన సంఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

బీహార్‌(Bihar) పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ పట్టణానికి చెందిన హిమాన్షు అనే యువకుడు ఐఐటీ(IIT) కి ప్రిపేర్‌ అవుతూనే హర్యానాలోని హిసార్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కొంతకాలంగా తల్లి ప్రతిమా దేవి హిమాన్షు దగ్గరే ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు ఒక రూ.5,000 కావాలని తల్లిని అడిగితే ఆమె నిరాకరించింది. ఇప్పుడు తన దగ్గర లేవని, తర్వాత చూస్తానని చెప్పిన దేవి.. అయినా అన్ని డబ్బులు ఏం చేసుకుంటావని కొడుకును గట్టిగానే మందలించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మాటమాట పెరిగి తీవ్ర రూపం దాల్చడంతో విచక్షణ రహితంగా తల్లిపై దాడి చేశాడు హిమాన్షు. దేవి గొంతు బలంగా నొక్కడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన నిందుతుడు తల్లి మృతదేహాన్ని ఎవరికీ కనిపించకుండా పడేసేందుకు ప్లాన్ చేశాడు.

ఇది కూడా చదవండి :తెలంగాణలో ఎన్నికలు వాయిదా!?

ఈ క్రమంలోనే మృతదేహాన్ని దగ్గరగా కట్టేసి ట్రావెల్‌ బ్యాగ్‌లో ప్యాక్ చేసి ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ బ్యాగ్‌ను త్రివేణి సంగమం వద్ద నదిలో పడేయాలనకుని చాలాసేపు అక్కడే దిక్కులు చూస్తూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే హిమాన్షుపై అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరకుని హిమాన్షు వద్ద ఉన్న బ్యాగ్‌ చెక్ చేయడంతో అసలు విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు. తల్లి మృతదేహం చూసి స్థానికులతోపాటు తాము షాక్‌ అయినట్లు తెలిపిన పోలీసు అధికారులు హిమాన్సును అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ఈ భయంకరమైన సంఘటన బీహార్ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది

New Update

AP Crime: విశాఖలో గర్భిణీ అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. పీఎం పాలెం పీఎస్‌ పరిధిలో గర్భిణీ అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలు ఆడిన్నారు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు.

గతంలో చంపడానికి ప్లాన్..

ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు స్నేహితులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్‌ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్‌ అందరికీ వీడియో కాల్‌ చేశాడు.
 
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే ఇవే లాభాలు

రాత్రికి రాత్రి అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే.. మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదు. వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.   

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

( AP Crime | ap-crime-news | ap-crime-report | ap crime updates | ap crime latest updates )

Advertisment
Advertisment
Advertisment