Telugu News: ప్రియుడి ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు.. ఎందుకంటే ? తనను గర్భవతిని చేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆందోళన చేస్తూ ఓ యువతి తన ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలలో జరిగింది. యువతిని స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు విచారిస్తున్నారు. By B Aravind 15 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. తనను గర్భవతిని చేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆందోళన చేస్తూ ఓ యువతి తన ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. దీంతో ఆ యువకుడి బంధువులు ఆ యువతిని చితకబాదారు. ఆమె ఫోన్‌ను ధ్వంసం చేశారు. సుల్తానాబాద్‌కు చెందిన ఆ యువతి.. ఐదేళ్లుగా తమ మధ్య ప్రేమ నడిచిందని చెబుతోంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. యువతిని స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులు విచారిస్తున్నారు. Also Read: రైతులతో మంత్రుల కమిటీ భేటీ! #rajanna-sircilla #telugu-news #telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి