TSRTC: మహిళకు టికెట్ కొట్టిన కండక్టర్ ఘటన.. అసలు నిజం ఇదే.. నిజామాబాద్ నుంచి బోధన్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళకు కండక్టర్ టికెట్ కొట్టడం చర్చనీయమైంది. అయితే ఆ ప్రయాణికుడు ముందుగా మూడు టికెట్లు ఇవ్వమనడంతో కండక్టర్ అలాగే ఇచ్చారు. కానీ వారిలో ఓ మహిళ ఉండటంతో టికెట్ చెప్పడం వల్ల కండక్టర్ ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. By B Aravind 10 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మహలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9న ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డితో సహా ఇతర మంత్రులు ప్రారంభించారు. ఆ రోజున మధ్యాహ్నం నుంచి మహిళలకు జీరో టికెట్లు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అయితే నిజామాబాద్ జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న ఆర్టీసీ బస్‌లో ఓ కండక్టర్ మహిళా ప్రయాణికురాలికి టికెట్ కొట్టడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా స్పందించారు. ఆ కండక్టర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ ఘటనపై అసలు విషయం బయటపడింది. Also Read: 54 మంది పోస్టులు ఊస్ట్.. రేవంత్ సంచలనం అసలేం జరిగిందంటే.. నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న బస్సులో ఓ ప్రయాణికుడు కండక్టర్‌కు మూడు టికెట్లు ఇవ్వమని అడిగాడు. దీంతో కండక్టర్ మూడు టికెట్లు కొట్టాడు. కానీ వారిలో ఒక మహిళ ఉంది. అయితే లేడిస్ ఉండగా టికెట్ ఎందుకు చెప్పావ్ అంటూ కండక్టర్ అడిగాడు. మరోవైపు లేడిస్‌కు ఎందుకు టికెట్ కొట్టావని ఆ ప్రయాణికుడు వాదించాడు. ముందుగా చెప్పలేదని.. చెప్పి ఉంటే టికెట్ కొట్టేవాన్ని కాదని కండక్టర్ తెలిపాడు. అయితే కండక్టర్ దురుసుగా ప్రవర్తించాడని ఈ ప్రయాణికుడు డిపో మెనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. అయితే కండక్టర్ దురుసుగా ప్రవర్తించలేదని అక్కడివారు చెబుతున్నారు. ప్రస్తుతానికి కండక్టర్ నర్సింహులను రిజర్వులో ఉంచామని బోధన్ డిపో మేనేజర్ తెలిపారు. Also Read: దారుణం.. కూతురుతో కలిసి దంపతుల ఆత్మహత్య.. కారణం ఇదే.. #telugu-news #telangana-news #tsrtc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి