Pot of Gold Coins: కుండ నిండా దొరికిన బంగారు నాణేలు.. ఎక్కడంటే

తుర్కియే పశ్చిమ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఓ కుండ నిండా బంగారు నాణేలు బయటపడ్డాయి. ఇవన్నీ క్రీస్తూ పూర్వం ఐదో శతాబ్దానికి చెందినట్లుగా భావిస్తున్నారు. వీటిని కిరాయి సైనికులకు చెల్లించేందుకు వినియోగించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

New Update
Pot of Gold Coins: కుండ నిండా దొరికిన బంగారు నాణేలు.. ఎక్కడంటే

Pot of Gold Coins in Turkey: పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఓ కుండ నిండా బంగారు నాణేలు బయటపడ్డాయి. తుర్కియే పశ్చిమ ప్రాంతంలో ఇవి కనిపించాయి. వీటితో పాటు విలువైన వస్తువులను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇవన్నీ క్రీస్తూ పూర్వం ఐదో శతాబ్దానికి చెందినట్లుగా భావిస్తున్నారు. ఈ వస్తువులన్నీ పురాతన గ్రీకు రాజ్యానికి చెందినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ బంగారు నాణేలను కిరాయి సైనికులకు చెల్లించేందుకు వినియోగించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read: కవితకు అప్పుడే బెయిల్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

అయితే కుండలో దొరికిన ఈ బంగారు నాణేలు ఓ కిరాయి సైనికుడికి చెందినవి కావొచ్చని అంటున్నారు. ఒక్కో బంగారు నాణె అతడి నెల జీతం కావొచ్చని గ్రీక్ చరిత్రాకారులు చెబుతున్నారు. క్రీస్తూ పూర్వం 427లో ఏథెన్స్‌కు చెందిన ఓ జనరల్ పర్షియా తరఫున దాడి చేసిన కిరాయి సైనికులకు హతమార్చారని.. ఈ బంగారు నాణేలు వాళ్లలోనే ఓ వ్యక్తికి చెందినట్లుగా భావిస్తున్నారు.

Also Read: పాఠశాలల్లో ఇకపై ‘గుడ్‌ మార్నింగ్’కు బదులు ‘జై హింద్‌’

Advertisment
Advertisment
తాజా కథనాలు