ఆ గ్రామంలో ఆర్మీ ఉద్యోగులే ఎక్కువ, ఇంతకీ అదెక్కడంటే..? ప్రస్తుతం ఆధునిక సమాజంలో యువత అంతా సాఫ్టువేర్ ఉద్యోగాల వైపుకు పరుగులు తీస్తున్నారు. కానీ ఆ గ్రామంలోని యువత దృష్టంతా ఆర్మీ, నేవి లాంటి ఉద్యోగాలపైనే ఫోకస్ పెట్టింది. మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం వెంకట్‌రెడ్డిపల్లి గ్రామం. 40 ఏళ్ల క్రితం ఈ గ్రామం నుండి కొంతమంది ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అలా ఇప్పటివరకు దేశం కోసం తమ సేవలను అందిస్తూ జిల్లాలోనే అత్యధిక ఆర్మీ ఉద్యోగులున్న గ్రామంగా రికార్డును సొంతం చేసుకున్నారు. By Shareef Pasha 16 Aug 2023 in Scrolling మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి ఆర్మీ ఉద్యోగం అంటేనే ఒంట్లో వణుకుపుడుతుంది. కానీ ఆ గ్రామం నుండి చాలామంది దేశసేవ చేయాలనే సంకల్పంతో ఆర్మీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం పని చేస్తున్న వారితో కలిసి వందకు పైగా ఆర్మీతో అనుబంధం ఉన్నవారు ఆ గ్రామంలో ఉన్నారు. పదవీ విరమణ పొందిన వారు దాదాపుగా 60కి పైగా ఉంటే, 30 మందికి పైగా ప్రస్తుతం దేశ సర్వీసులో ఉన్నారు. 40 ఏళ్ల క్రితం కొంతమంది ఆర్మీ ఉద్యోగానికి ఎంపిక Your browser does not support the video tag. మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం వెంకట్‌రెడ్డిపల్లి గ్రామం నుండి దాదాపు 40 ఏళ్ల క్రితం కొంతమంది ఆర్మీ ఉద్యోగానికి ఎంపిక అయ్యారు. వారిని ఆదర్శంగా తీసుకున్న యువత ఆర్మీ ఉద్యోగాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అలా ఒకరినొకరు ఆదర్శంగా తీసుకుంటూ ఇప్పటి దాకా ఆర్మీలో చేరిన వారి సంఖ్య సెంచరీని దాటింది. ఆర్మీలో ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వారు వ్యాపారాలను నిర్వహించుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వెంకట్ రెడ్డిపల్లి గ్రామంలో ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రస్తుతం ఆర్మీ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువకులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వెంకట్ రెడ్డిపల్లి గ్రామంలో ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు. అందులో అత్యధికంగా ఆర్మీ ఉద్యోగులు ఉండటం ఈ గ్రామం యొక్క ప్రత్యేకత. ఒక్కగానొక్క కొడుకు ఉన్న వాళ్ళు సైతం అర్మీలో పనిచేసేందుకు బార్డర్ కు పంపించే తల్లిదండ్రులు ఈ గ్రామంలో కనిపిస్తారు. ఒక్కో ఇంట్లో నుండి ఇద్దరు అన్నదమ్ములు కూడా ఆర్మీలో ఉద్యోగంలో కొనసాగుతున్నారు. దేశ సేవలో తమ గ్రామానికి ఒక ప్రత్యేకతను ఏర్పరచాలనే లక్ష్యంతో ప్రస్తుత యువత సైతం నడుం బిగించారు. ఆర్మీ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువకులకు సూచనలు అందుకోసం ఆర్మీ ఉద్యోగానికి ఎంపిక కావడమే లక్ష్యంగా అను నిత్యం శారీరక దృఢత్వం కోసం సాధన చేస్తున్నారు. సీనియర్ల సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా అధిక ఆదాయం ఉండే రంగాన్ని ఎంచుకుంటున్న ఈ రోజుల్లో దేశ సేవలో తమ పాత్ర ఉండాలని తపిస్తుంది వెంకట్‌రెడ్డిపల్లి గ్రామం. దేశంలోని ప్రతి పౌరుడు ఆర్మీలో కొన్నాళ్ల పాటు విధులు నిర్వహిస్తే దేశం పట్ల గౌరవం పెరగడంతో పాటు సమాజం పై బాధ్యత పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడిన జీవన విధానానికి అలవాటు పడతారు. మెరుగైన సమసమాజ స్థాపన చేయవచ్చనేది ఆర్మీ లో పనిచేసిన ఉద్యోగులు చెబుతున్న మాట. #telangana #new-record #army-jawans #mahaboobnagar #mahmoodnagar #venkatreddypalle మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి