Fake Doctors: ఢిల్లీలో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు

ఢిల్లీలోని నకిలీ డాక్టర్ల మూఠా వ్యవహారం బయటపడింది. నిందితులు ఫేక్‌ సర్డిఫెకేట్లతో సర్జరీలు చేసి ఇద్దరి ప్రాణాలు తీసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇద్దరు వైద్యులు, ఒక మహిళా సర్జన్, మరొకరు ల్యాబ్‌ టెక్నిషియన్‌గా చలామణి అవుతూ.. వైద్యం చేస్తున్నట్లు తేలింది.

New Update
Fake Doctors: ఢిల్లీలో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు

ఢిల్లీలోని ఫేక్ డాక్టర్ల మెడికల్ రాకెట్ బయటపడింది. ఫేక్ సర్టిఫికేట్లతో శస్త్రచికిత్స చేసిన ముఠా వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'గ్రేటర్ కైలాష్‌లోని ఓ క్లినిక్‌లో శస్త్ర చికిత్సలు చేయించుకున్న ఇద్దరు పేషెంట్లు ఇటీవలే మృతి చెందారు. అయితే నకిలీ డాక్టర్లు తమ వారిని హత్య చేశారని బాధిత బంధువులు ఆందోళనలు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇద్దరు వైద్యులు, ఒక మహిళా సర్జన్, మరొకరు ల్యాబ్‌ టెక్నిషియన్‌గా చలామణి అవుతూ.. వైద్యం చేస్తున్నారు. 2022లో అస్గర్ అలీ అనే ఓ రోగి శస్త్రచికిత్స కోసం క్లినిక్‌కు వచ్చాడు. ఆ పేషెంట్‌కు జస్ప్రీత్ అనే వైద్యుడు సర్జరీ చేయాల్సి ఉండగా.. అతడి స్థానంలో పూజ, మహేంద్రలు సర్జరీలు చేశారు. ఆ తర్వాత అతడికి కడుపు నొప్పి రావడంతో వేరే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.

Also read: తెలంగాణకు రాహుల్ గాంధీ.. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కూడా! జోరుగా కాంగ్రెస్ ప్రచారం

అయితే అగర్వాల్ మెడికల్ సెంటర్‌ను నడుపుతున్న డాక్టర్ అగర్వాల్, అలాగే మరో ముగ్గురు నకిలీ వైద్యులు అలీకి శస్త్రచికిత్స చేసినట్లు బాధిత కుటుంబం ఆరోపణలు చేసింది. దీంతో అగర్వాల్ ఒక ఫేక్ డాక్టరని.. ఇలా చాలామందికి చికిత్స చేసి హింసించనట్లు తమ విచారణలో వెల్లడైందని' పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా.. 2016 నుంచి వీళ్లపై 7 ఫిర్యాదులు ఉన్నాయని.. డాక్టర్ నీరజ్ అగర్వాల్, అతడి భార్య పూజా, డాక్టర్ జన్‌ప్రీత్‌ సింగ్‌తో పాటు మరో ముగ్గుర్ని అరెస్టు చేశామని చెప్పారు. వారిపై నమోదైన 7 కేసుల్లో ఈ ఫేక్ డాక్టర్ల చికిత్సతో రోగులు మరణించినట్లు పేర్కొన్నారు. ఫేక్ ధ్రువపత్రాలు పెట్టి వారు నకిలీ డాక్టర్లకు సర్జరీలు చేస్తున్నారంటూ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చందన్ చౌదరి తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారినుంచి ప్రిస్క్రిప్షన్ స్లిప్‌లు, నిషేధిత మందులు, ఇంజెక్షన్‌లు, వివిధ బ్యాంకులకు చెందిన 54 ఏటీయం కార్డులు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు