Wedding: ఆ దేశంలో రెండు పెళ్లిల్లు చేసుకోకుంటే జైలుకే..

ఆఫ్రికా ఖండంలోని ఎరిట్రియా అనే దేశంలో ప్రతి పురుషుడు ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి. లేకపోతే అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తారు. అలాగే అతని మొదటి భార్య కూడా తన భర్త రెండో పెళ్లికి చచ్చినట్లు అంగీకరించాల్సిందే. ఇది ఆ దేశంలో ఉన్న సంప్రదాయమే కాదు చట్టం కూడా.

New Update
Wedding: ఆ దేశంలో రెండు పెళ్లిల్లు చేసుకోకుంటే జైలుకే..

Wedding: పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టం. చాలామంది వివాహం చేసుకోవడానికే ఇష్టపడతారు. మరికొందరు సింగిల్‌గానే జీవితాన్ని గడుపుతుంటారు. ఇంకొందరైతే ఇద్దరిని కూడా పెళ్లి చేసుకుంటారు. అయితే ఆఫ్రికా ఖండంలోని ఎరిట్రియా అనే దేశంలో ఓ వెరైటీ వివాహ సంప్రదాయం ఉంది. ఇక్కడ పుట్టిన ప్రతి పురుషుడు కూడా కచ్చితంగా ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి. ఇది కేవలం ఆ దేశంలో ఉన్న ఒక సంప్రదాయం మాత్రమే కాదు. చట్టం కూడా.

Also Read: మహిళకు సర్జరీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే

ఒకవేళ.. ఆ దేశంలో పురుషుడు రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకుంటే.. అతడికి ఏకంగా జీవిత ఖైదీ శిక్ష విధిస్తారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ చట్టం కేవలం మగవారికి మాత్రమే కాదు ఆడవాళ్లకి కూడా వర్తిస్తుంది. ప్రతి స్త్రీ కూడా.. తన భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు అడ్డు చెప్పకుండా అంగీకరించాలి. మరో మహిళతో కలిసి తన భర్తతో సంసారం చేయాలి. ఒకవేళ మొదటి భార్య ఇందుకు అంగీకరించకపోతే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.

అందుకే ఆ దేశంలో పుట్టిన పురుషులు రెండు పెళ్లిల్లు చేసుకోవాల్సిందే. అలాగే స్త్రీలు తమ భర్తల రెండో వివాహానికి ఒప్పుకోవాల్సిందే. ఇదిలాఉండగా.. భారత్‌లో ఒక వ్యక్తికి ఒకే భార్య అనే నిబంధన ఉంది. ఒకవేళ రెండో పెళ్లి చేసుకుని.. అతని భార్య కేసు పెడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ ఎరిట్రియా దేశంలో రెండు వివాహాలు చేసుకోవడం చట్టబద్ధం.

Also Read: పోడవైన కాళ్లతో వరల్డ్ గిన్నీస్ రికార్డు సాధించిన మహిళ!

Advertisment
Advertisment
తాజా కథనాలు