/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Kids-jpg.webp)
వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో కోట్లాది మంది అభిమానులకు నిరాశే ఎదురైంది. టీమిండియా ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక చాలామంది కంటతడి పెడుతున్నారు. అయితే టీమిండియా ఓడిపోయిన అనంతరం ఇండియా జెర్సీ వేసుకొని ఓ బాలుడు వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏడవకు బిడ్డా.. టెన్నిస్ ఆటలో కూడా ఇలానే జరుగుతుందని చెబుతూ ఆ బాలుని తల్లి బుజ్జగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. క్రికెట్ అభిమానులు కూడా విభిన్నమైన కామెంట్లతో తమ ఆవేదనను చూపిస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో చూసేయ్యండి.
Video of little boy crying after World Cup final loss is all of India 💔💔 pic.twitter.com/9kliyVvvir
— JAMMU LINKS NEWS (@JAMMULINKS) November 20, 2023
Also Read: ‘ఆరే’శారు… ‘హెడ్’ లేపేశాడు.. రన్నర్ అప్ తో సరి పెట్టుకున్న భారత్..!
ఇదిలా ఉండగా.. మూడోసారి ప్రపంచకప్‌ను గెలవాలని భావించిన టీమిండియా ఓడిపోగా.. ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 1987, 1999,2003,2007,2015,2023 ప్రపంచకప్‌లు గెలుచుకుంది. అహ్మదాబాద్ వేదికగా మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ఆసీస్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 240 పరుగులు విజయ లక్ష్యాన్ని ఆసీస్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేజ్ చేసింది. దీంతో స్టేడియంలోని లక్షా30 వేల మంది అభిమానులతో పాటు కోట్ల మంది భారతీయులు కల చెదిరిపోయింది.
Also Read: దేన్నీ సాకులుగా చూపించాలని అనుకోవడం లేదు..రోహిత్ శర్మ