Crime : భార్య వివాహేతర సంబంధం.. అక్కడ కరెంట్ షాక్ ఇచ్చి చంపిన భర్త

మరోక వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే కోపంతో హమీద్‌ అనే వ్యక్తి తన భార్య ఖాతూన్ ను దారుణంగా హతమార్చాడు. అర్ధరాత్రి ఆమె నిద్రలో ఉండగా నోట్లో కరెంట్ షాక్ పెట్టి చంపేశాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌ లో జరిగింది. నిందుతుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
Crime : భార్య వివాహేతర సంబంధం.. అక్కడ కరెంట్ షాక్ ఇచ్చి చంపిన భర్త

Uttarakhand : భార్య(Wife) తనను మోసం చేసిందనే కోపంతో ఓ వ్యక్తి దారుణంగా హత మార్చాడు. జీవితాంతం తోడుంటానని మూడు ముళ్లు వేసిన చేతులతోనే అతి కిరాతకంగా చంపేశాడు. తాను ఉండగానే పరాయి పురుషుడితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో అర్ధరాత్రి కరెంట్ షాక్(Current Shock) ఇచ్చి ఆ ఇల్లాలి ఉసురు తీశాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తరాఖండ్‌(Uttarakhand) లోని హరిద్వార్‌ జిల్లాలో జరిగింది.

ఆమె నిద్రలో ఉన్నప్పుడు..
ఈ మేరకు పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ జిల్లాకు చెందిన హమీద్‌(Hameed) (60) తన కుటుంబంతో కలిసి మంగ్‌లౌర్‌ పోలీస్‌స్టేషను పరిధిలో కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. అయితే అతనికి భార్య ఖాతూన్‌(Khatoon) (52), ఒక కూతురు, కుమారుడు మహ్మద్‌ నదీం ఉన్నారు. కొంతకాలంగా సాపీగా సాగిన వారి కుటుంబంలో అనుకోని సంఘటనలు కలహాలకు దారితీశాయి. భార్య ఖాతూన్ మరోక పురుషుడితో అక్రమ సంబంధం(Illegal Affair) పెట్టుకున్నట్లు హమీద్‌ అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోన భార్యతో రోజు గొడవ పెట్టకునేవాడు. అనుమానం కాస్త రోజు రోజుకు మరింత పెరగడంతో.. ఆమెను హత మార్చాలనుకున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న హమీద్.. శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంటకు ఆమె నిద్రలో ఉన్నప్పుడు దారుణానికి పాల్పడ్డాడు. భార్య ఖాతూన్ నోట్లో కరెంట్ షాక్ పెట్టగా విద్యుదాఘాతానికి గురైన ఖాతున్.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

ఇది కూడా చదవండి : Suryapet: హాస్టల్ లో ఇంటర్ విద్యార్థిని మృతి.. వాళ్లే హత్య చేశారంటున్న పేరెంట్స్

ఇక ఈ ఇష్యూపై వారి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు హమీద్ హత్య చేసి పారిపోగా.. లంఢౌరా ప్రాంతంలో అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ ప్రమేంద్ర ఢోబాల్‌ వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

అమెరికా నుంచి ఫ్యామిలీ ట్రిప్.. మరో మృతుడు కుటుంబం కన్నీటి గాథ

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బితాన్‌ మృతి చెందాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న బితాన్ ఇటీవల సొంతూరు వచ్చి వెకేషన్‌కి భార్య, కొడుకుతో వెళ్లారు. ఈ క్రమంలో ఉగ్రదాడికి బలైయ్యాడు. కుమారుడు, భార్య ప్రాణాలతో బయటపడ్డారు.

New Update
west bengal software dead

west bengal software dead

జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశ వ్యాప్తంగా భయాందోళన మొదలైంది. కశ్మీర్ టూర్‌కి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. 28 మంది పర్యాటకులను టీఆర్‌ఎఫ్‌ ఉగ్రవాదుల కాల్చి చంపారు. వీరిలో చాలా మంది మృతి చెందారు. కొత్త పెళ్లయిన వారిని కూడా దారుణం కాల్చి చంపేశారు. ఓ లెఫ్టినెంట్ నేవీ అధికారి వినయర్‌ నర్వాల్ (26) ఆరు రోజుల కిందటే పెళ్లి జరిగింది. హనీమూన్‌కి వెళ్లగా ఉగ్రవాదులు కాల్చి చంపారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

భార్య, కుమారుడిని వదిలేసి..

వీరే కాకుండా మరో ఫ్యామిలీ కూడా ఈ ఉగ్రదాడికి బలైంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బితాన్‌ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నాడు. అక్కడ టీసీఎస్‌లో పనిచేస్తున్న బితాన్ సొంతూరు అయిన పశ్చిమ బెంగాల్‌కి ఇటీవల వచ్చారు. ఈ క్రమంలో భార్య, కొడుకుతో కలిసి వెకేషన్ కోసం కశ్మీర్ వెళ్లగా.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో భార్య పిల్లలను వదిలేసి.. బితాన్‌ను చంపేశారు. భర్త చనిపోవడంతో భార్య కన్నీరుమున్నీరు అవుతుంది. అతని కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

అలాగే ఓ లెఫ్టినెంట్ నేవీ అధికారి వినయర్‌ నర్వాల్ (26) ఆరు రోజుల కిందటే పెళ్లి జరిగింది. హనీమూన్‌కి వెళ్లగా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఏప్రిల్ 16న ఆయనకు వివాహం జరిగింది. హనీమూన్‌ కోసం ఆయన తన సతీమణితో కశ్మీర్‌కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే వినయ్ జీవితం ఉగ్రవాదులకు బలైపోయింది.

ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

భర్తను కోల్పోయిన ఆ నవవధువ ఆవేదన అందరినీ కన్నీ్ళ్లు పెట్టిస్తోంది. ఆమె రోదిస్తూ.. '' మాకు పెళ్లయి ఆరు రోజులే అయ్యింది. ఈ ఘటన జరిగినప్పడు మేము పానీపూరీ తింటున్నాం. ఒక్కసారిగా ఓ ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అడిగాడు. వెంటనే తన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడని'' ఆమె ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment