Crime: విశాఖపట్నంలో చిటీల పేరుతో భారీ మోసం

విశాఖపట్నంలోని గోపాలపట్నంలో చిట్టీల పేరుతో ఓ మహిళా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది.3 కోట్లకు టోకరా వేసి పరారయ్యింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ రోడ్డెక్కారు.

New Update
Crime: విశాఖపట్నంలో చిటీల పేరుతో భారీ మోసం

Crime: విశాఖపట్నంలోని గోపాలపట్నంలో చిట్టీల పేరుతో ఓ మహిళా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 కోట్లకు టోకరా వేసి పరారయ్యింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ రోడ్డెక్కారు. పిళ్లా కనకమహాలక్ష్మి అనే మహిళా గోపాలపట్నంలో చిట్టిల వ్యాపారం మొదలు పెట్టింది.

78 మందితో 5 లక్షల చిట్టిలను నడుపుతుంది. ముందులో డబ్బులు బాగానే ఇచ్చినప్పటికీ గతేడాదిగా లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో బాధితులు నిలదీయగా దశల వారీగా చెల్లిస్తామని పెద్దల సమక్షంలో నిర్ణయించారు. అయినప్పటికీ కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో లక్ష్మి ఇంటికి బాధితులు వెళ్లారు.

కాసేపు లక్ష్మి కుటుంబంతో వాగ్వాదానికి దిగి వారందరినీ లోపల పెట్టి తలుపులు వేశారు. లక్ష్మి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలపడంతో బాధితులు తలుపులు తీసి పోలీసుల సమక్షంలోనే బాధితులపై దాడికి దిగారు. ఏపీ ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని సీఎం, డిప్యూటీ సీఎంని బాధితులు వేడుకుంటున్నారు.

Also read: బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ

Advertisment
Advertisment
తాజా కథనాలు