USA : యూఎస్ లో హిందూ ఆలయం మీద ఖలిస్తానీల దాడి

విదేశాల్లో ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ ఆలయం మీద దాడి చేయడమే కాకుండా.. గుడి గోడల మీద ఖలిస్తానీ అనుకూల నినాదాలు కూడా రాసేసారుజ దాంతో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పిచ్చి రాతలు రాసారు.

New Update
USA : యూఎస్ లో హిందూ ఆలయం మీద ఖలిస్తానీల దాడి

Swaminarayan Temple : అమెరికా(America) లో ఖలిస్తానీ మద్దతుదారులు మారోసారి రెచ్చిపోయారు. కాలిఫోర్నియా(California) లోని నెవార్క్ లో ఉన్న స్వామినారాయణ టెంపుల్ మీద దాడి చేశారు. ఆలయ గోడలపై ఖలిస్థాన్‌కి మద్దతుగా రాతలు రాశారు. గ్రాఫిటీతో భారత్‌కి వ్యతిరేకంగా స్లోగన్స్ రాశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇప్పటికే పలు దేశాల్లో ఇలా భారత్‌కి వ్యతిరేకంగా హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. ముఖ్యంగా యూకే, ఆస్ట్రేలియాలో ఇలాంటివి వెలుగు చూశాయి.

పోలీసులతో పాటు పౌరహక్కుల సంఘాలూ ఈ దాడిపై విచారణ జరుపుతున్నాయి. విద్వేషాలు వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ దాడిని ఖండించింది. భారతీయుల మనోభావాల్ని ఇలాంటి ఘటనలు దారుణంగా దెబ్బ తీస్తాయని అసహనం వ్యక్తం చేసింది. దాడి చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఒత్తిడి తీసుకొచ్చాం. అమెరికా అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు.

ఆస్ట్రేలియా, కెనడాల్లో కూడా ఇలాంటి దాడులు ఇంతకు ముందు జరిగాయి. దీనివల్ల భారత్ తో ఇతర దేశాలకు ఉన్న సంబంధాలు దెబ్బ తింటున్నాయని భారత రాయబార కార్యాలయం అంటోంది. ఈ ఏడాది ఆగస్టులో కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ లో ఓ హిందూ ఆలయం మీద దాడి జరిగింది. అక్కడ ఖలిస్తానీ మద్దతుదారులు పోస్టర్లను అంటించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు