ఆంధ్ర అబ్బాయి..అగర్తల అమ్మాయి..ఆశీర్వదించిన త్రిపుర గవర్నర్.!

గుంటూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కందిమళ్ళ వెంకట్రావు, జయ శ్రీ దంపతుల కుమారుడు రామ్ నిట్ అగర్తలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. అదే సమయంలో తన సహచర విద్యార్థిని,అగర్తలకు చెందిన దాలియాతో ప్రేమలో పడ్డాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

New Update
ఆంధ్ర అబ్బాయి..అగర్తల అమ్మాయి..ఆశీర్వదించిన త్రిపుర గవర్నర్.!

ఒకేచోట చదువుకున్నారు..చూపులు కలిశాయి..మనసులు ఒక్కటయ్యాయి. ఇంకేముంది ప్రేమకు శుభం కార్డు వేశారు పెద్దలు. ఆంధ్ర అబ్బాయి.అగర్తల అమ్మాయి ఒక్కటయ్యారు.పెద్దలను ఒప్పించి సాంప్రదాయబద్ధంగా మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కందిమళ్ళ వెంకట్రావు, జయ శ్రీ దంపతుల కుమారుడు రామ్ కు నిట్ అగర్తలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు అదే సమయంలో తన సహచర విద్యార్థిని , అగర్తలకు చెందిన దాలియాతో ప్రేమలో పడ్డాడు. ఇంజనీరింగ్ విద్య పూర్తయిన పై చదువుల కోసం ఇద్దరూ కలిసి అమెరికాకు వెళ్లారు.

ఉన్నత చదువులు పూర్తయిన తర్వాతనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని అదే విషయాన్ని ఇరువైపులా పెద్దలకు తెలియజేశారు. ఇరుపక్షాల పెద్దలు అందుకు అంగీకరించారు. చదువు పూర్తి చేసుకున్న వారిరువురూ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చారు. ఈనెల 24న గుంటూరులో ఇరువైపులా పెద్దల సమక్షంలో తెలుగు సాంప్రదాయబద్ధంగా వివాహ క్రతువును పూర్తి చేసుకున్నారు. అయితే ఈరోజు అనగా (29-02-24)న త్రిపుర రాజధాని అగర్తలలో దాలియా స్వస్థలంలో వారి సాంప్రదాయ ప్రకారం వివాహ వేడుక నిర్వహించారు. రామ్ తండ్రి కందిమళ్ళ వెంకట్రావు సీనియర్ జర్నలిస్టు కావటంవల్ల ప్రస్తుతం త్రిపుర రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేస్తున్న నల్లు ఇంద్రసేనారెడ్డి తో గతంలోనే ఆయనకు పరిచయం ఉంది. త్రిపురలో జరుగుతున్న తన కుమారుడి వివాహ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించడంతో, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అగర్తల పట్టణంలోని ఫ్లవర్స్ క్లబ్ మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో జరిగిన రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులు రామ్, దాలియాలను ఆశీర్వదించారు.

ఇది కూడా చదవండి: వనపర్తి జిల్లాలో దారుణం.. ప్రాణం తీసిన ఎగ్ బజ్జీ..!

Advertisment
Advertisment
తాజా కథనాలు