Hyderabad: బీజేపీ ఎంపీ నవనీత్‌ కౌర్‌పై క్రిమినల్ కేసు నమోదు!

బీజేపీ ఎంపీ నవనీత్‌ కౌర్‌పై క్రిమినల్ కేసు నమోదు నమోదైంది. ఓవైసీ సోదరులనుద్దేశించి 15 సెకండ్ల కాంట్రవర్సీ కామెంట్స్‌ చేయడంపై యాకత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఇన్‌ఛార్జ్‌ రాకేష్ ఫిర్యాదు చేశారు. దీంతో పలు IPC సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు సైదాబాద్ పోలీసులు తెలిపారు.

New Update
Hyderabad: బీజేపీ ఎంపీ నవనీత్‌ కౌర్‌పై క్రిమినల్ కేసు నమోదు!

Case Filed Against MP Navneet Kaur : నటి, బీజేపీ ఎంపీ నవనీత్‌ కౌర్‌కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల ఓవైసీ సోదరులను (Owaisi) ఉద్దేశిస్తూ 15 సెకన్ల సమయంకావాలంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మరో క్రిమినల్ కేసు నమోదు నమోదైంది. యాకత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న రాకేష్ సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో IPC 505(2), 506171(C), 171(F), 171(G) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: AP: అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తాం.. సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు!

ఈ మేరకు మహారాష్ట్రకు చెందిన అమరావతి ఎంపీ, బీజేపీ స్టార్ క్యాంపెనర్ నవనీత్ కౌర్.. లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) భాగంగా మాధవీలతకు (Madhavi Latha) మద్దతుగా మే 8న హైదరాబాద్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ముస్లింలను రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు. 13 ఏళ్ల క్రితం అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన 15 నిమిషాల కామెంట్స్‌ తరహాలోనే ఆమె 15 సెకండ్స్ చాలు అంటూ సంచలనంగా మాట్లాడారు. అంతేకాదు కాంగ్రెస్‌కు (Congress) ఓటు వేస్తే పాకిస్థాన్‌కు వేసినట్లే అన్నారు. దీంతో ఆమె కామెంట్స్ రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఇది సమాజానికి ప్రమాదం అంటూ షాద్‌నగర్‌లోనూ నవనీత్ కౌర్‌పై పలువురు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ‘వాళ్లకు 15 నిమిషాలేమో.. అదే తమకు పోలీసులు పక్కకు తప్పుకుంటే కేవలం 15 సెకన్లు చాలు. తాము తలుచుకుంటే ఎక్కడికిపోతారో తెలియదు’ అన్నారు. దీంతో అధికారులు ఎన్నికల నిబంధనల ప్రకారం సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే నవనీత్ కౌర్ ను అరెస్ట్ చేయబోతున్నారా? ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు