Car accident: సూర్యాపేటలో కారు దగ్ధం.. ఫ్యామిలీ సేఫ్.. వీడియో వైరల్! సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ప్రమాదం తప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 24 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Suryapet : ఎండ వేడి(Heat) కారణంగా మరోకారు దగ్ధమైంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ(Government Junior College) వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ముందుగానే గమనించి కారునుంచి సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది(Fire Fighters) వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. వీడియో వైరల్ అవుతోంది. Your browser does not support the video tag. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీసులు.. చివ్వెంల మండలం వట్టి కాంపాండు గ్రామానికి చెందిన గోపాలరావు అతని కుటుంబ సభ్యులతో కలిసి పని నిమిత్తం సూర్యాపేటకు వస్తుండగా ఈ ప్రమాదం(Fire Accident) జరిగిందని చెప్పారు. ఎండ వేడి కారణంగా కారులో షార్ట్ సర్క్యూట్ వల్లే ఇలా అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: Crime: శృంగారంపై మోజుతో యువకులను వేధించిన వివాహిత.. ప్రియుడు ఏం చేశాడంటే! #fire-accident #car-fire #suryapet సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి