సరిహద్దులో ఆయుధాలు కదులుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందాలు రద్దైపోతున్నాయి. పాక్, భారత్‌ల మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయాయి. అటు పాక్ ఇండియా బార్డర్‌లో మిస్సేల్ టెస్ట్ చేస్తోంది. ఈ పరిస్థితులు అన్నీ చూస్తోంటే ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదేమో అనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నుంచి భారత్‌తో ఖయ్యానికి పాక్ సరైన సమయం కోసం ఎదురు చూస్తోంది. ఆ సమయం ఇప్పుడు రానే వచ్చిందన్నట్టు ఇరు దేశాలు వ్యవహరిస్తున్నాయి. పహల్గామ్‌లో 26 మంది టూరిస్టులను ఏప్రిల్ 22న TRF ఉగ్రవాదులు కాల్చి చంపారు. బీహార్ పర్యటనలో మోదీ ఉగ్రదాడిపై స్పందించారు. మరణించిన బాధితులకు నివాళులర్పించారు. తన ప్రసంగానికి ముందు రెండు నిమిషాలు మౌనం పాటించారు. పహల్గాం దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులను భూమిలోకి తొక్కేస్తామని మోదీ అన్నారు. కలలో కూడా ఊహించని శిక్షలు విధిస్తాం. పహల్గాం ఘటనతో దేశమంతా దుఃఖంలో మునిగిపోయింది. మృతుల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుంది. ఇది కేవలం పర్యాటకులపై జరిగిన దాడి కాదు. భారత ఆత్మపై జరిగింది. ఉగ్రవాదుల వేట కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. చనిపోయిన వాళ్లలో అన్న రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఉన్నారు. ఉగ్రవాదులకు సహకరించిన సూత్రధారులను కూడా వదలిపెట్టమని'' ప్రధాని మోదీ అన్నారు.
భారత్ సంచలన నిర్ణయాలు
ప్రధాని మోదీ బుధవారం రక్షణ శాఖ, హోం శాఖ, విదేశాంగ మంత్రులు, సెక్యూరిటీ ఆఫీసర్లతో సీసీఎస్ సమావేశమైయ్యారు. ఈ మీటింగ్‌లో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. 1960 నాటి సింధు జల ఒప్పందం తక్షణమే నిలిపివేయబడుతుందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. 72 గంటల్లోగా భారత్‌లో ఉన్న పాకిస్తాన్ హై కమాండ్ ఆఫీస్ కూడా ఖాళీ చేశాలని కేంద్రం ఆదేశించింది. పాకిస్తాన్‌కు ఇచ్చే స్పెషల్ వీసాలను కూడా రద్దు చేసింది. బిసిసిఐ పాకిస్తాన్ దేశంలో ద్వౌపాక్షి సిరీస్ క్రికెట్ మ్యాచ్‌లు కూడా రద్దు చేసింది. అలాగే పాక్ సినిమాలను, నటులను కూడా ఇండియాలో రద్దు చేశారు. వాఘా-అట్టారి సరిహద్దు క్రాసింగ్‌ను వెంటనే మూసివేస్తామని మిస్రీ ప్రకటించారు. అలాగే పాకిస్థాన్ జాతీయులు ఇండియాకు రాకుండా నిషేధించడంతో పాటు ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లడానికి 48 గంటల సమయం ఇవ్వబడిందని మిస్రీ తెలిపారు.
పాక్ ప్రధాని అత్యవసర సమావేశం
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గురువారం జాతీయ భద్రతా కమిటీ (NSC) అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు పాక్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. పాక్ కూడా మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారత్ ఆరోపణలను పాక్ ఎలా ఖండిస్తోందో చూడాలి. పాక్ కూడా వెనక్కి తగ్గకుంటే రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైయ్యే అవకాశం ఉంది.
పాక్ మిస్సేల్ టెస్ట్
పాక్ ఇండియాపై యుద్ధానికి కాలు దువ్వుతుందని చెప్పడానికీ కారణం లేకపోలేదు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి రెండు రోజులు కూడా కావడం లేదు. ఇండియా సరిహద్దులో కరాచీ ప్రాంతంలో పాకిస్తాన్ మిస్సేల్ టెస్ట్ చేస్తోంది. దీనికోసం ఇండియన్ ఆర్మీ అధికారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితలం నుంచి ఉపరితలంపై ప్రయోగించే షాహీన్- III లేదా బాబర్ క్రూయిజ్ వంటి క్షిపణులు పరీక్షలకు చేస్తోండచ్చని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు చెబుతున్నాయి. 2,750 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఇది ఛేదిస్తోంది. అంటే అటు ఇటుగా భారతీయ ప్రధాన నగరాలను ఈ మిస్సేల్ నాశనం చేసే శక్తి ఉంది.
యుద్ధం అనివార్యమా..?
వారం రోజుల క్రితం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య అగ్గికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. అలాగే పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియన్ గర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు పాక్‌కు నష్టం కలిగించవచ్చు. మరో పక్క పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి చేసింది తామేనని చెప్పింది.
లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ క్లారిటీ
లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి అకా సైఫుల్లా ఖలీద్ మంగళవారం జరిగిన పహల్గామ్ దాడిలో తన పాత్ర లేదని ఖండించారు. భారత ప్రభుత్వం, మీడియా పాక్‌ను తప్పుగా చూపిస్తున్నాయని ఆయన ఓ వీడియో చేసి రిలీస్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాడులకు తనను, పాకిస్తాన్‌తో ముడిపెట్టవద్దని సైఫ్రుల్లా చెబుతున్నాడు. పాకిస్తాన్ ప్రతిష్టను నాశనం చేయడానికి భారతదేశమే కారణమని ఖలీద్ అంటున్నాడు. ప్రపంచం దేశాలు గుడ్డిగా భారత్‌కు మద్దతు ఇవ్వకండి, దీనికి బదులు వాస్తవాలు మాట్లాడండని ఉగ్రవాద సంస్థ చీఫ్ సైఫుల్లా అన్నాడు. పహల్గామ్ అటాక్ తామమే చేశామని డ్రామా క్రియేట్ చేయోద్దన్నాడు.