/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/SURATH-jpg.webp)
చిన్న పిల్లల్లో గుండెపోటు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉన్నచోటనే కుప్పకూలుతున్న ఘటనలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో గుండెపోటుతో మరణించారు. తాజాగా గుజరాత్ లోని సూరత్ లో జరిగిన ఘటన మరింత కలవరపెడుతోంది. గోదాదర ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని క్లాస్‌లో చదువుతుండగా అకస్మాత్తుగా స్పృహతప్పి కిందపడిపోయింది.
ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం మానుకోండి…లేదంటే ఈ వ్యాధులు తప్పవు..!!
టీచర్ వెంటనే ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించడంతో బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ విద్యార్థిని మరణించినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థిని కింద పడిపోయిన ఘటన మొత్తం తరగతి గదిలో అమర్చిన సీసీటీవీలో రికార్డయింది. ఈ ఘటనపై పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
હે ભગવાન આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં?? દીકરી ભણતા ભણતા અચાનક ક્લાસમાં ઢળી પડી, સારવારમાં મૌત.. જુઓ વિડીયો 👇👇#viralvideo #gujarat #video #surat pic.twitter.com/dv7kdIdSMP
— Gujarati Akhbar (@TodayGUJARAT1) September 28, 2023
In Surat, girl (13) dies of suspected heart attack in classroom https://t.co/f1IiChZcFT
— Surat Club (@SuratClub) September 28, 2023
అటు కరీంనగర్ జిల్లాలోనూ కొన్ని నెలల క్రితం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలో గుండు ప్రదీప్తి అనే విద్యార్థిని ఫ్రెషర్స్ డే సందర్భంగా స్టేజ్ డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలింది. గంగాధర మండల్ మోడల్ స్కూల్లో జరిగిన ఈ సంఘటనలో బాలిక స్పృహ కోల్పోయిన వెంటనే సమాచారం అందుకున్న ఆమె తల్లిదండ్రులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. బాలిక మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది.
ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు గుండు శారద,అంజయ్యలు మాట్లాడుతూ.. తమ కూతురు ప్రదీప్తి గుండెలో రంధ్రం చిన్ననాటి నుండి ఉందని తెలిపారు. దీంతో పలుమార్లు కరీంనగర్,హైదరాబాద్ ఆస్పత్రుల్లో తిరిగి చికిత్స అందించామన్నారు. ఆస్పత్రిలో వైద్యులు బలవర్ధకమైన ఆహారం పెడితే సరిపోతుందన్నారని తల్లి శారద ఆవేదన వ్యక్తం చేసింది. ప్రదీప్తి గుండెకు ఆపరేషన్ చేయరాదని వైద్యులు తెలిపారని చెప్పింది.
ఇది కూడా చదవండి: పిల్లల్లో చదివే అలవాటును పెంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!!
అయితే కొంత కాలం పాటు మందులు వాడిన తర్వాత ఆమె ఆరోగ్యవంతంగానే ఉందని తెలిపింది. శుక్రవారం రోజున మధ్యాహ్నం గంగాధర మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఫోన్ చేసి మీ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయిందని తెలపడంతో.. వెంటనే వెళ్లామని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందిందని తల్లి కన్నీరుమున్నీరైంది. ఇక మృతురాలు ప్రదీప్తి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.