/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-12-15.jpg)
Sexual Attack On Blind Girl : ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రభుత్వాలు ఎంత కఠిన చట్టాలు చేస్తున్నా చిన్నారులపై పైశాచిక దాడులు ఆగడం లేదు. అభంశుభం తెలియని పిల్లలపై అకృత్యాలకు అడ్డుకట్ట పడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజు ఏదోకచోట చిన్నారులపై దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ (Hyderabad) మలక్‌పేటలో మరో పైశాచికం వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల అంధ బాలిక (Blind Girl) పై కామాంధుడొకడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బయటపడింది.
ఈ దారుణ ఘటన జరిగింది. బాత్రూంలు శుభ్రంచేసే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. వికారాబాద్ జిల్లా (Vikarabad District) కు బాలిక మలక్‌పేటలోని అంధ బాలికల వసతి గృహంలో ఉంటూ అక్కడే చదువుకుంటోంది. ఈ నెల 7న ఉదయం బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో వసతి గృహం నిర్వహకులు ఆమె తల్లిదండ్రులను పిలిచి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రాణాపాయంలో ఉన్న తమ కుమార్తెను ఆస్పత్రికి తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వసతి గృహం సిబ్బందిపై బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు కూడా పట్టించుకోలేదు. దీంతో చేసేది లేక బాలికను నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. నిలోఫర్ వైద్యుల సమాచారంతో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. ఈ విషయం తెలియడంతో బాలిక తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాలతో కలిసి మలక్‌పేట పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.
మంత్రి సీతక్క సీరియస్..
మలక్‌పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో జరిగిన లైంగిక దాడి ఘటనపై మంత్రి సీతక్క (Minister Seethakka) సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులతో మాట్లాడి.. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, బాధితురాలికి సత్వర న్యాయం అందేలా చూడాలని ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టపరంగా తగిన శిక్షపడేలా చూడాలన్నారు.
Also Read:Telangana: తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్
TG News: రేవంత్ సర్కార్ ను కూల్చడానికి రంగం సిద్ధం.. BRS ఎమ్మెల్యే సంచలన ప్రకటన!
రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొని గవర్నమెంట్ కూల్చాలని కోరుతున్నారంటూ దుమారం రేపారు.
TG News: రేవంత్ సర్కార్‌ను కూల్చేందుకు రంగం సిద్ధమైందంటూ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్డర్లు, పారిశ్రామి కవేత్తలు కాంగ్రెస్ పాలనతో విసుగు చెందారని, వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని అన్నారు. అంతేకాదు అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామంటున్నారంటూ దుమారం రేపారు.
కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది..
ఈ మేరకు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్ గా ఉంటే కుదరడం లేదు. దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు. సర్పంచులకు బిల్లులు రాక లబో దిబోమని మొత్తుకుంటున్నారని, ఇళ్లు, డ్రైనేజీలు కట్టినవారు బిల్లులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారన్నారు. తెలంగాణ పది జిల్లాల్లో దుబ్బాక అంత దారుణంగా ఏదీ లేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పొంగులేటి కౌంటర్..
అయితే ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 'ప్రభుత్వాన్ని కూల్చాలన్నదే తండ్రీకొడుకుల ఆలోచన. గవర్నమెంట్ కూల్చి తండ్రీకొడుకులు ఆ కుర్చీలో కూర్చోవాలన్నదే ఆలోచన. ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్‌ఎస్ నేతలు పదేపదే అంటున్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండి. కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి. తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వం భయపడదు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా భూభారతి అమలు చేసి తీరుతాం' అని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు.
kotta-prabhakar | cm revanth | brs | congress | telugu-news | today telugu news
Stomach Ulcers: కడుపులో పుండ్లు ఎందుకు వస్తాయి.. ఎలా నియంత్రించాలి?
Mamya Shajaffar: ట్రెడిషనల్ లుక్‌లో మమ్యా షజాఫర్.. ఎల్లో డ్రెస్‌లో లక్ష్మీదేవిలా కనిపిస్తుందిగా!
HCU భూముల వ్యవహారం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన!
JEE Main Exam: జేఈఈ విద్యార్థులకు షాక్.. 'కీ' లో గందరగోళం
Balayya: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..