Haryana: హర్యానాలో బోల్తాపడిన బస్సు..ఆరుగురు చిన్నారులు మృతి హర్యానాలో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. నార్నాల్ అనే ఊరులో ఈరోజు ఉదయం స్కూల్ బస్సు బోల్తా పడడంతో ఆరుగురు చిన్నారులు మృతి చెందగా...20 మందికి పైగా గాయపడ్డారు. By Manogna alamuru 11 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Haryana School Bus Accident: డ్రైవర్ నిర్లక్ష్యం ఆరుగురు అభంశుభం తెలియని చిన్నారుల ప్రాణాలను హరించింది. హర్యానాలోని నార్నాల్‌లో జరిగిన ఈ సంఘటన రంజాన్ రోజు పెను విషాదాన్ని మిగిల్చింది. మామూలుగా అయితే ఈరోజు స్కూళ్ళు అన్నీ సెలవు. కానీ జిఎల్ పబ్లిక్ స్కూల్ అధికారులు మాత్రం సెలవు ఇవ్వలేదు. దీంతో పండగ పూటా చిన్నారులు స్కూలుకు వెళ్ళారు. పిల్లలను స్కూలుకు తీసుకువెళుతున్న క్రమంలో బస్సు కనీనాలోని ఉన్హాని గ్రామ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రగాయాలు పాలయ్యారు. గాయపడిన విద్యార్థులను స్థానిక ఆసుప్రతికి తరలించారు. యాక్సిడెంట్ విషయం తెలుసుకున్నపోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ప్రథమిక విచారణలో బస్సు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టడం వల్లనే ప్రమాదంజరిగిందని తేలింది. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే డ్రైవర్ కూడా తాగి ఉన్నాడేమో అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటూ ఆరేళ్ళ క్రితమే అంటే 2018లోనే బస్సు ఫిట్ నెస్ సర్టిఫికెట్ గడువు కూడా ముగిసిందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక పత్రాలు కూడా చూపిస్తున్నారు. ఇలాంటి బస్సులను నడపుతున్న స్కూలు యాజమాన్యం మీద విద్యార్ధుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పిల్లలను తీసుకెళ్ళే బస్సుల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని అడుగుతున్నారు. తమ పిల్లల ప్రాణాలను అన్యాయంగా బలి తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. Also Read:PM Modi: భారతదేశం అంతులేని శక్తిగా ఎదుగుతోంది-ప్రధాని మోదీ #accident #school-bus #haryana #driver #drunk మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి