/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-86-1.jpg)
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనలో అక్కడికి వచ్చిన 50 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కొండచరియలు విరిగిపడి మార్కండ నదిపై నిర్మించిన తాత్కాలిక చెక్క వంతెన కొట్టుకుపోయింది. దీంతో గురువారం యాత్రను నిలిపివేయగా.. దాదాపు 50 మంది యాత్రికులు ఏకంగా 11,473 అడుగుల ఎత్తులో ఉన్న మద్మహేశ్వర ఆలయం సమీపంలో చిక్కుకుపోయారు.
Also Read: స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై కోదండరాం ఫైర్
ఇదిలాఉండగా.. గత కొద్దిరోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. గత ఏడాది కూడా ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో ఓ బ్రిడ్జి కూలిపోయింది. దీంతో 300 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. చివరికి ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వారిని రక్షించాయి.
Also read: ఇకపై నో టోల్.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన