AIDS: మళ్లీ విజృంభిస్తున్న హెచ్‌ఐవీ.. నిమిషానికి ఒకరు మృతి! ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజా సర్వే ఆధారంగా వెల్లడించింది. సెక్స్ వర్కర్లు, వివాహేతర సంబంధాల కారణంగా యువతలో ఈ వ్యాధి అధికంగా ఉన్నట్లు గుర్తించింది. 2023లో 6.3 లక్షల మంది మరణించినట్లు తెలిపింది. By srinivas 23 Jul 2024 in ఇంటర్నేషనల్ లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి HIV: ఎయిడ్స్ మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన ఎయిడ్స్ ప్రపంచదేశాల్లో మళ్లీ విజృంభిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజా సర్వే ఆధారంగా వెల్లడించింది. ఈ మేరకు ఇటీవల చేపట్టిన రిసెర్స్ ఆధారంగా 2023 ముగిసే నాటికి 4 కోట్ల మంది హెచ్‌ఐవీ (HIV)తో బాధపడుతున్నట్లు పేర్కొంది. 90 లక్షల మందికి పైగా ఎలాంటి చికిత్స తీసుకోకపోవడంతో నిమిషానికి ఒకరు చనిపోతున్నట్లు తెలిపింది. 2023లో 6.3లక్షల మంది మరణం.. ఈ మేరకు 2004లో 21లక్షల మంది ఎయిడ్స్ కారణంగా చనిపోగా 2023లో 6.3లక్షల మంది మరణించినట్లు తెలిపింది. 2025 నాటికి ఈ సంఖ్యను 2.5లక్షలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. ఎయిడ్స్ నివారణకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. దీన్ని అరికట్టడంలో ఊహించిన స్థాయిలో ఫలితాలు దక్కిడం లేదు. దీని నిర్మూలనకు నిధులు కేటాయిస్తున్నాం. అయినా పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా, తూర్పు యూరప్, మధ్య ఆసియా, లాటిన్ అమెరికాలో ఈ కేసులు పుట్టుకొస్తున్నట్ల పేర్కొంది. ఇది కూడా చదవండి: Union Budget 2024: కిషన్ రెడ్డి, బండి సంజయ్ బానిసలు.. కేంద్ర బడ్జెట్ పై రేవంత్ ధ్వజం! ఇక లింగ అసమానతలపై ప్రభావం.. హెచ్‌ఐవీ విజృంభణ లింగ అసమానతలకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో యువతలో ఈ వ్యాధి అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెక్స్ వర్కర్లు, వివాహేతర సంబంధాలు దీన్ని పెరుగుదలకు ముఖ్య కారణమవుతోందని, డ్రగ్స్ ఇంజెక్ట్ చేసే వ్యక్తుల సంఖ్య 2010తో పోలిస్తే.. 45 నుంచి 55 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. 2030 నాటికి ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేసేందుకు ప్రణాళిక రచించినట్లు తెలిపింది. 2025 నాటికి కొత్త హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌లను 3.7 లక్షల కంటే తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2023లో కొత్త ఇన్‌ఫెక్షన్ల సంఖ్య మూడు రెట్లు పెరిగి 1.3 మిలియన్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. #hiv #united-nations #aids మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి