Bangladesh: బంగ్లాదేశ్‌ను ముంచెత్తిన వరదలు..13 మంది మృతి మొన్నటి వరకు అల్లర్లతో సతమతమయిన బంగ్లాదేశ్‌ను ఇప్పుడు వరదలు ముంచెత్తాయి. మొత్తం 4.5 మిలియన్ ప్రజలు వరద ముంపుకు గురైయ్యారు. ఇప్పటివరకు 13 మంది చనిపోయారని తెలుస్తోంది. By Manogna alamuru 23 Aug 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bangladesh Floods: బంగ్లాదేశ్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆదేశంలోని కుమిల్లా, నోఖాలి, బ్రాహ్మణబారియా, చిట్టగాంగ్, కాక్స్ బజార్, సిల్హెట్ మరియు హబిగంజ్ జిల్లాలు వరదల బారిన పడ్డాయి. దీని కారణంగా 4.5 మిలియన్ ప్రజలు ప్రభావితం అయ్యారు. దాదాపు ఎనిమిది లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. మరోవైపు ఈ వరదల్లో కొట్టుకుపోయి 13 మంది మృతి చెందారు. వరదల బారి నుంచి ప్రజలను కాపాడ్డానికి అక్కడి సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. బంగ్లాదేశ్ ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్, బోర్డర్ గార్డ్స్, ఫైర్ సర్వీస్, పోలీసులు మరియు ఇతర ఎన్జీవోలు వరద ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటివరకు 1, 88, 739 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాధితులకు ప్రభుత్వం నగదు, బియ్యం, పొడి ఆహార పదార్థాలను అందజేస్తోందని మంత్రిత్వ శాఖ కార్యదర్శి కమ్రుల్ హసన్ తెలిపారు. దేశంలో తూర్పు ప్రాంతంలో ఉన్న ఐదు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీని కారణంగా అక్కడ టెలీకమ్యూనికేషన్ బంద్ అయిపోయింది. వరద ప్రభావిత జిల్లాల్లో 14% మొబైల్ టవర్లు ఉన్నాయి. అవి పనిచేయడం మానేశాయి. Also Read: Kolkata: నా కొడుకు అమాయకుడు, కావాలని ఇరికించారు–కోలకత్తా డాక్టర్ హత్య నిందితుడు తల్లి #rains #floods #bangaladesh #13-dead మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి