300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్...నిర్మలా సీతారామన్

ప్రపంచంలోనే కోటి ఇళ్లకు కొత్తగా సోలార్‌ పథకం అమలు చేస్తామని చెబుతున్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ పథకం కింద 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు. ఈ సారి బడ్జెట్‌లో ఇదొక కొత్త పథకం కింద ఆమె ప్రవేశపెట్టారు.

New Update
300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్...నిర్మలా సీతారామన్

Budget:ప్రజలకు తీపి కబురునందించారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు.  దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు సరికొత్త రూఫ్‌టాప్‌ సోలారైజేషన్‌ స్కీమ్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. దీనివల్ల గృహ వినియోగదారులకు ఏటా రూ. 15వేల నుంచి రూ.18 వేల వరకు ఆదా అవుతుందని తెలిపారు. దాంతో పాటూ దేశంలో మరిన్ని మెడికల్‌ కాలేజీలకు అనుమతిని ఇస్తున్నామని తెలిపారు. అలాగే ఆశా వర్కర్లందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక పశ్చిమ ఆసియా కారిడార్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి గేమ్‌ ఛేంజర్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు బాగా పెరుగుతున్నాయి. కానీ ఇండియా లో మాత్రం ద్రవ్యోల్బణం పెరుగుదలను కట్టడి చేశామని చెప్పారు.

Also read:Budget Session:పేదవారి అభివృద్ధే…దేశాభివృద్ధి..మధ్యంతర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్

వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్లను మంజూరు చేస్తామని...దేశంలో గూడు కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా చూడ్డమే బీజేపీ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం మంది మహిళలకు ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. దాంతో పాటూ యువత కోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాల మీద నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘స్కిల్ ఇండియా మిషన్ 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చింది, 54 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించింది. 3000 కొత్త ITIలను స్థాపించింది. పెద్ద సంఖ్యలో సంస్థాగత ఉన్నత విద్యలు( 7 IITలు, 16 IIITలు, 7 IIMలు, 15 AIIMలు)తో పాటు 390 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వచ్చే ఐదేళ్ల కాలం అభివృద్ధికి మారుపేరుగా భారత్ మారుతుందని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు