Bihar : ఎస్సైలుగా ఎన్నికైన ముగ్గురు ట్రాన్స్ జెండర్లు

దేశ చరిత్రలో మొదటి సారిగా ముగ్గురు ట్రాన్స్‌ జెండర్లు ఒకేసారి ఎస్సైలుగా నియమితులయ్యారు. అంతకు ముందు తమిళనాడు, కేరళల నుంచి ఒక్కొక్కరే ఎస్‌ఐలు సెలక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు తాజాగా బీహార్‌లో ముగ్గురు ఒకేసారి ఈ పోస్ట్‌లకు సెలక్ట్‌ అయి చరిత్ర సృష్టించారు.

New Update
Bihar : ఎస్సైలుగా ఎన్నికైన ముగ్గురు ట్రాన్స్ జెండర్లు

Transgenders Selected For SI Jobs : ఉద్యోగాల్లో పురుషులతో పాటు మహిళలు కూడా పోటీలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పిస్తున్నారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న పలువురు ట్రాన్స్ జెండర్లు (Transgenders) తమ సత్తా ఏంటో చాటుతున్నారు. ఈ క్రమంలోనే దేశ చరిత్రలోనే మొదటిసారి ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఒకేసారి ఎస్ఐలు అయ్యారు. తాజాగా బీహార్ ప్రభుత్వం (Bihar Government) విడుదల చేసిన పోలీస్ సర్వీస్ కమిషన్ (Police Service Commission) పలితాల్లో 1,275 మంది అభ్యర్థులు పాస్ కాగా.. అందులో ముగ్గురు ట్రాన్స్ జెండర్లకు కూడా ఉన్నారు.

ఎస్‌ఐ (SI) లుగా సెలెక్ట్ అయిన వారిలో ఇద్దరు ట్రాన్స్ మెన్(పుట్టుకలో ఆడ) కాగా.. ఒకరు ట్రాన్స్ ఉమెన్(పుట్టుకలో మగ) . గతంలో కూడా పలు రాష్ట్రాల్లో ట్రాన్స్ జెండర్లు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా, ఎస్సైలుగా ఉద్యోగాలు సాధించారు. తమిళనాడు, కేరళలో ఒక్కొక్కరి చొప్పున మాత్రమే ఎస్సైలు కాగా బీహార్ లో మాత్రం ఏకంగా ఒకేసారి ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఎస్సైలుగా ఎన్నికై చరిత్ర తిరగరాశాడు.

Also Read:Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీ

Advertisment
Advertisment
తాజా కథనాలు