Yamaha: వినియోగదారులకు బిగ్‌ షాక్‌.. 3,00,000 బైక్స్‌ రికాల్‌!

ఇండియా యమహా మోటార్ తన 125 సిసి స్కూటర్ మోడళ్లకు చెందిన 3 లక్షల యూనిట్లను రీకాల్ చేసింది. స్కూటర్లో బ్రేక్ భాగాన్ని సరిచేయడానికి వీటిని రీకాల్ చేస్తున్నారు. జనవరి 1, 2022 నుంచి జనవరి 4, 2024 మధ్య తయారైన స్కూటర్లను తక్షణమే రీకాల్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

New Update
Yamaha: వినియోగదారులకు బిగ్‌ షాక్‌.. 3,00,000 బైక్స్‌ రికాల్‌!

Yamaha Recalled its Bike: యమహా తన 125 సిసి హైబ్రిడ్ స్కూటర్లను రీకాల్ చేసింది. దాదాపు 3 లక్షల యూనిట్లను రీకాల్ చేసింది. రీకాల్ చేసిన స్కూటర్లు జనవరి 1, 2022 నుంచి జనవరి 4, 2024 మధ్య తయారు చేసినవిగా తెలుస్తోంది. ఆ బైకులను వెంటనే వెనక్కి ఇవ్వాలని సంబంధింత షోరూమ్‌లకు ఇన్ఫో పంపింది. బ్రేక్ లివర్ పనితీరులో సమస్యను పరిష్కరించడమే ఈ రీకాల్ ఉద్దేశ్యంగా సమాచారం.

డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు:
నిజానికి కంపెనీ రే జెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్, ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్లు జనవరి 2022 తర్వాత తయారు చేశారు. వీటికి బ్రేక్ లివర్ పనితీరులో సమస్యను కలిగి ఉన్నాయి. దీనిని సరిచేయడానికి కంపెనీ రీకాల్ చేయాలని నిర్ణయించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి పార్ట్ రీప్లేస్మెంట్లు ఉచితంగా ఉంటాయి. అంటే, దీని కోసం వినియోగదారులు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇది ఇండియా యమహా మోటార్ ఇప్పటివరకు చేసిన అతిపెద్ద రీకాల్. సియామ్ కోడ్ ఆఫ్ వాలంటరీ రీకాల్ 2012 జూలైలో అమల్లోకి వచ్చినప్పటి నుంచి కంపెనీ మొత్తం 63,977 యూనిట్లను రీకాల్ చేసింది. 2013 జూలైలో 56,082 సిగ్నస్ రే స్కూటర్లను, 2014 మార్చిలో 138 ఆర్1 మోటార్ సైకిళ్లను, 2019 డిసెంబర్లో 7,757 ఎఫ్జెడ్ 150 బైక్లను రీకాల్ చేసింది. యమహా ఇండియాలో మొత్తం రీకాల్స్ సంఖ్య ఇప్పుడు 3,63,977 యూనిట్లకు పెరిగింది.

Also Read: కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు