/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/flight.jpg)
Flight Cancelled: మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయంతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలోని లోపం కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది భారత విమానయాన సేవలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాసా ఎయిర్ మరియు స్పైస్‌జెట్‌తో సహా పలు విమానయాన సంస్థలు వివిధ సాంకేతిక లోపాలను ఎదుర్కొన్నాయి. స్లో చెక్-ఇన్‌లు, విమానాశ్రయాలు, సంప్రదింపు కేంద్రాల వద్ద భారీ క్యూలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రయాణికులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఇండియన్ ఎయిర్‌లైన్స్.. ఇండిగో దేశ వ్యాప్తంగా దాదాపు 200 విమానాలను రద్దు చేసినట్లు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణ వ్యవస్థలో తలెత్తిన అంతరాయం కారణంగా విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. ఫ్లైట్ రీబుక్ లేదా రీఫండ్‌ను క్లెయిమ్ చేసే ఆప్షన్ కూడా తాత్కాలికంగా అందుబాటులో లేదని పేర్కొంది. రద్దయిన విమానాల వివరాలను తెలుసుకునేందుకు https//bit.ly/4d5dUcZ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నుంచి సుమారు 192 విమానాలు రద్దయ్యాయి.
కాగా.. మైక్రోసాఫ్ట్ వినియోగదారులు Microsoft 360, Microsoft Windows, Microsoft Team, Microsoft Azure, Microsoft Store, Microsoft క్లౌడ్-ఆధారిత సేవలను ఉపయోగించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. 74 శాతం మంది వినియోగదారులు మైక్రోసాఫ్ట్ స్టోర్‌లోకి లాగిన్ అవ్వడంలోనే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో 36 శాతం మంది ప్రజలు యాప్‌ను ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంపెనీకి సంబంధించిన ఇతర ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడంలో సమస్యలు తలెత్తుతున్నాయి.
Also read: మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్.. బిలియన్ల డాలర్లు నష్టం