Watch Video: దారుణం.. ఎన్నారై ఇంట్లో దుండగుల కాల్పులు ఇటీవల అమెరికా నుంచి పంజాబ్‌కు వచ్చిన ఓ ఎన్నారై ఇంట్లో ఇద్దరు దండగులు కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. లావాదేవీల వ్యవహారంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. By B Aravind 24 Aug 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి పంజాబ్‌లో దారుణం జరిగింది. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన ఓ ఎన్నారైపై ఇద్దరు దుండగులు కాల్పులు జరపడం కలకలం రేపింది. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన సుఖిత్‌చైన్ అనే వ్యక్తి ఇటీవలే ఇండియాకు వచ్చారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో డబుర్జి గ్రామంలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు దుండగులు బైక్‌పై వాళ్లింటికి వచ్చారు. ఇంట్లోకి ప్రవేశించి బాధితుడిని తుపాకితో బెదిరించి మరో గదిలోకి వెళ్లాలన్నారు. అందుకు అతడు నిరాకరించడంతో ఆ ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ సమయంలో బాధితుడు కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోనే ఉన్నారు. Also Read: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత.. క్లారిటీ ఇచ్చిన రంగనాథ్ కాల్పులు తర్వాత దుండగులు పారిపోయారు. అక్కడి స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా.. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన బాధితుడు కొన్ని రోజుల క్రితం ఓ హోటల్, లగ్జరీ కారు కొనేందుకు యత్నించారు. అయితే ఈ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలోనే కాల్పులు జరిగాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీపీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నామని.. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. This video showing two assailants entering an NRI’s house in Shri Amritsar Sahib in broad daylight, with their faces clearly visible, and shooting a man in front of his family is heart-wrenching and brings tears to our eyes. Watching the victim’s mother and child begging for… pic.twitter.com/2m3zHOOeV6 — Daaman Bajwa (@DaamanB) August 24, 2024 Also Read: దోమల బెడద.. పరిష్కారం చూపించిన ఆనంద్ మహీంద్రా #telugu-news #national-news #punjab #nri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి