China: కుప్పకూలిన రోడ్డు.. 19 మంది మృతి దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఓ రహదారిలో కొంత భాగం కుప్పుకూలింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. By B Aravind 01 May 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి China Highway Collapse - 19 Died: దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఓ రహదారిలో కొంత భాగం కుప్పుకూలింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారు. రోడ్డుపై వాహనాల్లో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని మీజౌ, డాబు కౌంటీ నగరాల మధ్య ఉన్న రోడ్డులో ఈ ఘటన జరిగింది. సమాచారం మేరుక ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయాలపాలైనవారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. Also Read: 100 స్కూళ్లకి పైగా బాంబు బెదిరింపులు.. రష్యా నుంచి మెయిల్స్ ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. నేలలోకి రోడ్డు ఒక్కసారిగా దిగబడిపోవడంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ఆ లోతైన గోతిలో పడిపోయాయి. దీంతో మంటలు, పొగలు వ్యాపించాయి. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే గ్వాంగ్‌డాంగ్ ప్రాంతంలో ఇటీవల విపరీతమైన వాతావరణ మార్పులు, వరదలు, సుడిగాలులు సంభవించడం వల్ల ఈ ప్రమాదానికి దారి తీసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. Also Read: మనుషులతో పనిలేని పెట్రోల్ బంక్ లు..వేగంగా ఆయిల్ నింపుతున్న రోబోటిక్ లు! 🚨#WATCH: As daytime footage shows the aftermath of a highway collapse which left dozens of casualties in southern China. 📌#Guangdong | #China At least 19 people were killed and 30 others were hospitalized after a section of a highway collapsed in the Guangdong province of… pic.twitter.com/r1hR0UXw65 — R A W S G L 🌎 B A L (@RawsGlobal) May 1, 2024 #telugu-news #china #highway #china-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి