Andhra Pradesh: రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవు.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు కేంద్రం ఇచ్చే రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీకి రూ.లక్షా యాభై వేల కోట్లు కావాలని.. టీడీపీ ఇచ్చిన హామీల్లో ఏవీ అమలు చేయలేరని పేర్కొన్నారు. ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత ఆయన మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. By B Aravind 24 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Uncategorized New Update షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మాజీ సీఎం, వైసీపీ ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కేంద్రం ఇచ్చిన రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవని అన్నారు. ఏఏపీలో ప్రభుత్వ పాలను వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలో వైఎస్ జగన్.. తన పార్టీ నేతలతో కలిసి ధర్నా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ' కేంద్రం ఇచ్చే రూ.15 వేల కోట్లు దేనికి సరిపోవు. ఏపీకి రూ.లక్షా యాభై వేల కోట్లు కావాలి. టీడీపీ ఇచ్చిన హామీల్లో ఏవీ అమలు చేయలేరు. లోకేష్ రెడ్‌బుక్ పోస్టర్లతోనే వాళ్ల ఉద్దేశం స్పష్టంగా తెలిసింది. Also read: పట్టాలెక్కిన రాజధాని నిర్మాణం.. అమరావతి వెనుక ఎన్నో వివాదాలు, పోరాటాలు రోడ్లమీదే దారుణ హత్యలకు పాల్పడుతున్నారు. 560 ప్రైవేట్ ఆస్తులు, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. మా పార్టీ నేతలు సొంత నియోజకవర్గాల్లోనే నలగలేకపోతున్నారు. మేము ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని డోర్ డెలివరీ చేశాం. చంద్రబాబు దొంగ హామీల వల్లే ఓడిపోయామని' అన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి. Also read: ఈ సారి గోల్డ్ కొడతారా.. టీమిండియా హాకీ జట్టుపై కోటి ఆశలు! #telugu-news #andhra-pradesh-news #union-budget #ex-cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి