Telangana:15 రోజుల్లో 15వేల పోలీస్ ఉద్యోగాలు..నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 15 వేల పోలీసు ఉద్యోగ ఖాళీల భర్తీకి మరో 15 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగులు దరఖాస్తుకు సిద్దంగా ఉండండి అంటూ పిలుపునిచ్చారు. By Manogna alamuru 08 Feb 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి 15 Thousand Police Jobs: తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్యోగాల ప్రకటన స్పీడు పెంచుతున్నారు. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఉద్యోగాలను ప్రకటిస్తున్నారు. తాజాగా సింగరేణి, పోలీసు ఉద్యోగాల భర్తీల మీద కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగ యువత నియామక పరీక్షలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా 15వేల పోలీస్ ఉద్యోగ ఖాళీల భర్తీకి మరో 15 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని గుడ్ న్యూస్ చెప్పారు. 60 కొత్త ఖాళీలతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామని అన్నారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. Also Read:Cricket:ఐసీసీ ర్యాంక్సింగ్‌లో బుమ్రా అరుదైన ఘనత నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కావాలి... రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. 32 లక్షల మంది నిరుద్యోగుల్లో విశ్వాసం నింపేందుకు తమ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపడుతుందని సీఎం అన్నారు. పోలీస్ ఉద్యోగాలతో పాటూ, సింగరేణి, 64 కొత్త ఖాళీలతో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రేవంత్ తెలిపారు. సింగరేణిలో 80 వాతం ఉద్యోగాలను స్థానికులకే ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. వయోపరిమితి పెంపు... ఉద్యోగాల ప్రకటనతో వయోపరిమితి కూడా పెచుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పరీక్షల రద్దు వల్ల ఛాన్స్ కోల్పోయిన వారు మళ్ళీ పరీక్సలకు హజరయ్యే ఛాన్స్ కల్పిస్తామని అన్నారు. రెండేళ్ళ వయోపరితి సడలింపు తీసుకువస్తామని తెలిపారు. కానిస్టేబుల్ నియామక పత్రాలు దీంతో పాటూ ఇప్పటికే పోలీస్ ఉద్యోగాలకు ఎపంఇకైన అభ్యర్ధులకు నియామక పత్రాలు కూడా అందిస్తామని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈనెల 19 నుంచి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభించనున్నట్లు సమాచారం. పీటీసీలో మౌలిక వసతుల కల్పన, ఇండోర్, అవుట్ డోర్ శిక్షణ మీద డీజీపీ రవిగుప్తా అధికారులతో ఇప్పటికే రివ్యూ చేశారు. మొత్తం 15,644 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. #telangana #cm-revanth-reddy #police-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి