Accident : ఘోర ప్రమాదం.. 40 అడుగుల గోతిలో పడిన బస్సు.. 15 మంది మృతి! చత్తీస్ గఢ్ లో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఉద్యోగులను తీసుకుని వెళ్తున్న వాహనం మట్టిగని వద్ద మొరం కోసం తవ్విన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదం లో ఇప్పటి వరకు 15 మంది చనిపోగా... 12 మందికి పైగా గాయపడ్డారు. By Bhavana 10 Apr 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Bus Accident : దేశంలో రోడ్డు ప్రమాదాలు(Road Accident) నిత్య కృత్యంగా మారాయి. రహదారులే యమపాశాలై ప్రజల జీవితాలను హరిస్తున్నాయి. గత కొంతకాలంగా వాహన ప్రమాదాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. తాజాగా చత్తీస్ గఢ్(Chhattisgarh) లో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దుర్గ్ జిల్లాలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఉద్యోగులను తీసుకుని వెళ్తున్న వాహనం మట్టిగని వద్ద మొరం కోసం తవ్విన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదం లో ఇప్పటి వరకు 15 మంది చనిపోగా... 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన మంగళవారం రాత్రి 8. 30 గంటల ప్రాంతంలో కుమ్హారి పోలీస్ స్టేషన్(Kumhari Police Station) పరిధిలోని కేడియా వద్ద జరిగింది. ఓ డిస్టిలరీ కంపెనీలో పని చేస్తున్న 30 మంది ఉద్యోగులను ఇళ్లకు తీసుకుని వెళ్తున్న బస్సు ఖాప్రీ గ్రామం సమీపంలో ప్రమాదానికి గురైంది. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు జారి 40 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది అక్కడిక్కడే చనిపోగా.. నలుగురు వ్యక్తులు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అధికారులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. Also read: ఉరుములు , మెరుపులతో ఇక వర్షాలే…వర్షాలు! #road-accident #chhattisgarh #bus-accident #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి