Bengaluru:బాబోయ్ బాంబు..బెంగళూరులో స్కూళ్ళకు బెదరింపు

బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వరుసపెట్టి అక్కడ 15 స్కూళ్ళకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం గందరగోళంగా మారింది.

New Update
Bengaluru:బాబోయ్ బాంబు..బెంగళూరులో స్కూళ్ళకు బెదరింపు

బెంగళూరులో ఒకేసారి 44 స్కూళ్ళకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అన్ని స్కూల్స్‌కీ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో స్కూళ్ళ యాజమాన్యాలు ఉలిక్కిపడ్డాయి. వెంటనే విద్యార్ధులను ఇంటికి పంపించేశాయి. ముందుగా ఏడు స్కూల్స్‌కి బెదిరింపులు వచ్చాయి. బసవేశ్వర్‌నగర్‌లోని రెండు పాఠశాలల యాజమాన్యాలు ఈ బెదిరింపులతో వణికిపోయాయి. కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ ఇంటి ముందు ఉన్న స్కూల్‌కీ ఇవే బెదిరింపులు రావడం మరింత ఆందోళన కలిగించింది.

Also read:రాజస్థాన్ ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలివే..

మొదట స్కూల్స్ కు ఈ మెయిల్స్ వచ్చినప్పుడే బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే విచారణ చేటపట్ఆరు. అయితే ఆ తరువాత మిగతా స్కూల్స్‌కి ఇవే మెయిల్స్ పంపారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు పెద్ద ఎత్తున ఆ పాఠశాలలకు చేరుకున్నారు. విద్యార్థులు, స్టాఫ్‌ని బయటకు పంపించేశారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్‌ అన్ని స్కూల్స్‌కీ వెళ్ళాయి. అక్కడ తనిఖీలు చేస్తన్నారు. అయితే ఎక్కడా బాంబు పెట్టిన ఆనవాళ్ళు కనిపించలేదు. కేవలం ఈ మెయిల్స్ లో మాత్రమే బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది. గతేడాది కూడా బెంగళూరులో కొన్ని స్కూల్స్‌కి ఇలాంటి బెదిరింపు మెయిల్సే వచ్చాయి. ఆ తరువాత కేవలం ఎవరో బెదిరించడం కోసమే చేశారని తెలిసింది. ఇప్పుడు ఇది కూడా అలాంటిదేనా... లేక ఇంకేదైనానా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

అయితే ఏది ఏమైనా తాము మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకున్నామని స్కూల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. విద్యార్ధులు క్షేమమే తమకు ముఖ్యమని అంటున్నారు. అందుకే పిల్లలను వెంటనే ఇంటికి పంపించేశామని తెలిపారు.

Also Read:మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్..ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తారు?

Advertisment
Advertisment
తాజా కథనాలు