వైద్యుల నిర్లక్ష్యం.. 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ, హెపటైటీస్ వ్యాధులు..

ఉత్తరప్రదేశ్‌లోని లాలా లజపతిరాయ్ ఆసుపత్రిలో 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ, హెపటైటీస్ బీ, సీ వ్యాధులు సోకడం కలకలం రేపింది. వాస్తవానికి ఆ 14 మంది చిన్నారులు తలసేమియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్లకి ఎప్పటికప్పుడు రక్తమార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇలా చేయించుకున్న సమయాల్లోనే ఆ చిన్నారులకు ఈ వ్యాధులు సోకినట్లు తేలింది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది.

New Update
వైద్యుల నిర్లక్ష్యం.. 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ, హెపటైటీస్ వ్యాధులు..

హెచ్‌ఐవీ.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధికి గురైనవారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుంది. సాధారణంగా లైంగిక సంబంధం వల్ల వచ్చే ఈ వ్యాధి.. ఈ మధ్యకాలంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల రక్తమార్పిడి చేసే విషయంలో కూడా పలువురు హెచ్‌ఐవీకి గురైన ఘటనలు ఉన్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని లాలా లజపతిరాయ్ ఆసుపత్రిలో ఓ దారుణం చోటుచేసుకుంది. రక్తమార్పిడి చేసేటప్పుడు వైద్యులు నిర్లక్ష్యం వహించడంతో.. 14 మంది చిన్నారుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. కలుషిత రక్తం ఎక్కించడం వల్ల.. ఆ చిన్నారులకు హెచ్‌ఐవీ, హెపటైటిస్ బి, సీ సోకినట్లు తేలింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. వాస్తవానికి ఆ 14 మంది చిన్నారులు తలసేమియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్లకి ఎప్పటికప్పుడు రక్తమార్పిడి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో లాలా లజపతి రాయ్ ఆసుపత్రిలో రక్తమార్పిడి చేయించుకుంటున్న చిన్నారుల్లో ఏడుగురికి హెపటైటిస్ బీ, ఐదుగురికి హెపటైచిస్ సీ, ఇద్దరికి హెచ్‌ఐవీ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ పిల్లలందరూ కూడా 6 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే కావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే తలసేమియాతో బాధపడుతున్న వీరికి ఈ వైరస్‌లు మరింత ఇబ్బందులకు గురిచేస్తాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also read: గుండె ధైర్యం చేసుకొని చూడండి.. ట్రాక్టర్‌తో తొక్కించి దారుణ హత్య..

అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. మన ఆరోగ్య వ్యవస్థను డబుల్ ఇంజిన్ సర్కార్ మరింత అనారోగ్యంగా మార్చిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ధ్వజమెత్తారు. ఇలాంటి దారుణమైన నిర్లక్ష్య ఘటన జరగడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా సందర్భంగా ప్రధాని మోదీ పది తీర్మానాలు చేసుకోవడం గురించి మాట్లాడారని.. ఎప్పుడైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జవాబుదారీతనం గురించి ఆలోచించారా అంటూ ప్రశ్నించారు. అయితే ఈ చిన్నారులందరూ యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. వీళ్లకి అత్యవసర సమయాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రక్తం ఎక్కించినట్లు పలు మీడియా కథనాలు తెలిపాయి. ఆ చిన్నారులకు ఈ ఇన్ఫెక్షన్లు సోకడానికి గల కారణాలను గుర్తిస్తున్నామని కాన్పూర్ వైద్యాధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపడంతో.. దీనిపై పేడియాట్రిక్ డిపార్ట్‌మెంట్ అధిపతి డా. అరుణ్ కుమార్ ఆర్య స్పందించారు. ఈ చిన్నారులకు ఇన్ఫెకన్లు ఆరు నెలల వ్యవధిలో జరగలేవని.. గత ఎనిమిది సంవత్సరాల్లో చిన్నారులకు ఈ ఇన్ఫెక్షన్లు సోకాయని క్లారిటీ ఇచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు