Hyderabad Metro: హైదరాబాద్‌లో రానున్న మరో 13 మెట్రో స్టేషన్లు.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో మరో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన అధికారులతో కలిసి స్టేషన్ల స్థానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. By B Aravind 28 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad Metro Second Phase - 13 New Stations: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో మరో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న నాగోల్ స్టేషన్ సమీపంలో మొదటి స్టేషన్‌తో ప్రారంభమై.. ఆ తర్వాత నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీనగర్ కూడలి, సాగర్ రింగ్‌రోడ్డు, మైత్రీనగర్, కర్మన్‌ఘాట్, చంపాపేట రోడ్ కూడలి, ఒవైసీ ఆసుపత్రి, డీఆర్‌డీవో, హఫీజ్ బాబానగర్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో కొత్త మెట్రో స్టేషన్లు రాబోతున్నాయని పేర్కొన్నారు. Also read: కేసీఆర్‌కు గౌరవం తగ్గిపోదు.. ఈ రూట్‌లో మెట్రోరైలు ఎలైన్‌మెంట్, స్టేషన్ల స్థానాలను ఖరారు చేసేందుకు శనివారం ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాగోల్ నుంచి చంద్రాయణగుట్ట (Nagole To Chandrayangutta) వరకు కొన్ని ఫ్లైఓవర్ల వల్ల స్టేషన్ల కోసం భూసేకరణ అనివార్యంగా మారిందని.. ప్రైవేటు ఆస్తులు కనిష్ఠంగా సేకరించేందుకు ప్రణాళికలు చేపట్టలాని అధికారులకు ఆదేశించారు. అలాగే మెట్రో రైలు స్టేషన్లకు సంబంధించి వాటి పేర్ల ఖరారుకు ట్రాఫిక్ పోలీసులు, సాధారణ ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని సూచనలు చేశారు. Also read: రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు #telugu-news #hyderabad-metro #metro-rail #metro-stations మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి