Covid Alert:కరోనా బీభత్సం...ఒక్క నెలలోనే 10వేల మరణాలు

కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. నెమ్మదిగా పాత రోజులకు చేరుకుంటామేమోనని ఆందోళన రేకెత్తిస్తోంది. కొత్త వేరియంట్ స్ప్రెడ్ అవ్వడం మొదలు అయ్యాక ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా పదివేల మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది.

New Update
Covid Alert:కరోనా బీభత్సం...ఒక్క నెలలోనే 10వేల మరణాలు

JN 1 variant:కరోనా మళ్ళీ బీబత్సం సృస్టిస్తోంది. ప్రపంచం కొత్త వైరస్ జేఎన్1 వ్యాప్తి చెందుతోంది. కొత్త వైరస్ కారణంగా ఒక్క నెలలోనే ప్రపంచ వ్యాప్తంగా పదివేల మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా విడుదల చేసింది. డిసెంబర్‌లో సెలవులు అధికంగా ఉంటాయని...ఆ టైమ్‌లో సోసల్ గ్యాదరింగ్స్ ఎక్కువగా అవ్వడంవ ల్లనే ఈ మరణాలు సంభవించాయని చెప్పారు ఐరాస చీఫ్ టెడ్రోస్. డిసెంబర్‌లో దాదాపు 10,000 మరణాలు సంభవించాయని, కొత్త సంవత్సరంలో 50 దేశాల్లో ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 42శాతం పెరిగిందని ఆయన తెలిపారు. ఎక్కువ కేసులు యూరప్, అమెరికా నుండి వచ్చాయని చెప్పారు.

Also read:హ్యాపీ బర్త్‌డే..ది వాల్, మిస్టర్ డిపెండబుల్..

చాలా వేగంగా వ్యాస్తి చెందుతోంది

కరోనా కొత్త వైరస్ జెన్1 మీద ఐక్యరాజ్య సమితి ఆదంఓళన వ్యక్తం చేసింది. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాస్తి చెందుతోందని అంటున్నారు ఛీఫ్ టెడ్రోస్. అంతేకాదు దీని వలన సంభవించిన మరణాలు గరిష్ట స్థాయి కంటే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. ఇవి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని...ప్రభుత్వాలు దీని మీద నిఘా ఉంచి చికిత్స, టీకాలు వేయించాలని సూచించారు. ఇది ఓమిక్రాన్ వేరియంట్, కాబట్టి ఇప్పటికే ఉన్న టీకాలు కూడా దీని నుండి రక్షించగలవు. కరోనావైరస్‌తో పాటు, ఫ్లూ, రైనోవైరస్, న్యుమోనియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయని WHO టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు.

భారతదేశంలో...

మన దేశంలో కూడా కోవిడ్ కేసులు ఎక్కువగానే ఉన్నాయి. లాస్ట్ 24 గంటల్లో దేశం మొత్తం మీద 605 కేసులు నమోదు కాగా..నలుగురు మరణించారు. కొత్తగా కేసులతో కలిపి ప్రస్తుతం 3,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో మహారాష్ట్ర నుండి 250, కర్ణాటక 199, కేరళ 148, గోవా 49, గుజరాత్ 36, ఆంధ్రప్రదేశ్ 30, రాజస్థాన్ 30, తమిళనాడు 26,తెలంగాణ నుంచి 21 మంది, ఢిల్లీ నుంచి 21 మంది, ఒడిశా నుంచి 3 మంది, హర్యానా నుంచి ఒకరు కోవిడ్‌తో బాధపడుతున్నారు. దీంతో ఇప్పటివరకు.. జనవరి 2020 నుంచి భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 4,50,19, 819కి చేరుకోగా, మొత్తం మరణాల సంఖ్య 5,33,406కి చేరుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు