ఇటీవల అమెరికాలో వీసాల రద్దు లేదా స్టూడెంట్ అండ్ ఎక్స్‌చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సెవీస్) రికార్డుల నుంచి తొలగింపునకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఇందుకు సంబంధించి విద్యార్థులు, న్యాయవాదులు, యూనివర్సిటీ ఉద్యోగుల నుంచి 327 కేసు నివేదికలను ఈ సంఘం సేకరించింది. ఈ అంతర్జాతీయ విద్యార్థులలో సగం మంది భారతదేశానికి చెందిన వారు కాగా 14 శాతం మంది చైనా విద్యార్థులని ఏఐఎల్‌ఏ ప్రకటించింది. మిగిలిన విద్యార్థులు ప్రధానంగా దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన వారని తెలిపారు.
ఇప్పుడు వీరందరికీ అక్కడి న్యాయస్థానం ఊరట కల్పించింది. మొత్తం 133 మంది స్టూడెంట్ ఎక్స్‌ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ను న్యాయస్థానం పునరుద్ధరించింది. ఇందులో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. విద్యార్థుల వీసాల రద్దులో ప్రభుత్వం నిర్ణయం సరికాదని ఇమ్మిగ్రేషన్ లాయర్లు చెప్పారు. అయితే అమెరికా ప్రభుత్వ ఏజెన్సీల వాదన మాత్రం వేరేగా ఉంది. విద్యార్థులు పలు సందర్భాల్లో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల దృష్టిలోపడ్డారని చెబుతున్నాయి. ఈనేపథ్యంలో తాము తాత్కాలికంగా అడ్డుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చెబుతున్నాయి. కానీ, ఈ విద్యార్థులకు ఎటువంటి నేర చరిత్ర లేదు.
అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దు ఏకపక్షంగా జరుగుతున్నట్లు ఏఐఎల్‌ఏ ఆందోళన వ్యక్తం చేసింది. తాము సేకరించిన కేసుల నివేదికలలో 86 శాతం కేసులు ఏదో ఒక స్థాయిలో పోలీసులతో సంప్రదింపులకు నోచుకున్నాయని, 33 శాతం వీసాలు రద్దయిన కేసులలో అభియోగాలు నమోదు చేయకపోవడం, వారిపై కేసులు పెట్టడం లేదని ప్రకటన తెలిపింది.
గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన జోన్‌లో 70 కిలోమీటర్ల వేగంతోడ్రైవ్ చేయడం, చట్టవిరుద్ధంగా వాహనం పార్కింగ్ చేయడం, సీటు బెల్టు ధరించకపోవడం, నెంబర్ ప్లేట్లు గడువు తీరిపోవడం వంటి చిన్న చిన్న అభియోగాలతో పోలీసుల నుంచి ఓపీటీ విద్యార్థులకు నోటీసులు అందాయి. వీసా రద్దుకు గురైన విద్యార్థులలో ఇద్దరు విద్యార్థులకు మాత్రమే రాజకీయ నిరసనలలో పాల్గొన్న చరిత్ర లేదని ఏఐఎల్‌ఏ తెలిపింది. వీసా రద్దుకు సంబంధించిన ఈమెయిర్ నోటీసులు అందుకున్న మెజారిటీ విద్యార్థులకు ఈ నోటీసు వీసాను మంజూరు చేసిన కాన్సులేట్ నుంచి వచ్చినట్లు ఏఐఎల్‌ఏ పేర్కొంది.
today-latest-news-in-telugu | usa | student-visa
Also Read: Danish Kaneria: ఉగ్రదాడిలో ప్రమేయం లేకపోతే..పాక్ ఎందుకు ఉలికిపడుతోంది..డానిష్ కనేరియా