Andhra Pradesh : వైసీపీ కార్యాలయం కూల్చివేత.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు తాడేపల్లిగూడెంలో ఈరోజు తెల్లవారుజామున వైసీపీ కార్యాలయాన్ని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. సూపర్ - 6 అమలు చేయడం కన్నా.. వైసీపీ ఆఫీసును కూల్చడమే ముఖ్యమని భావించిన చంద్రబాబు ప్రజాస్వామ్యవాదా? విధ్వంసకారుడా? అంటూ ట్వీట్ చేశారు. By B Aravind 22 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి YCP Party Office : తాడేపల్లి (Tadepalle) లో ఈరోజు తెల్లవారుజామున వైసీపీ (YCP) కార్యాలయాన్ని సీఆర్‌డీఏ (CRDA) అధికారులు కూల్చివేసే పనులు ప్రారంభించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ బుల్డోజర్లు, ప్రొక్లెయినర్లతో నిర్మాణంలో ఉన్న శ్లాబ్‌ను కూల్చివేశారు. రెండు అంతస్తులను పిల్లర్లతో సహా కూల్చివేయడంతో ఆఫీస్ మొత్తాన్ని నేలమట్టం చేశారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి నిన్ననే హైకోర్టు (High Court) కు వెళ్లామని.. కానీ అధికారులు హడావిడిగా కూల్చివేశారని వైసీపీ విమర్శిస్తోంది. Also Read: ఏపీలో రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజే స్పీకర్ ఎన్నిక మరోవైపు దీనిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు (Ambati Rambabu) ఎక్స్ (X) వేదికగా స్పందించారు. రాష్ట్రంలో సూపర్ - 6 అమలు చేయడం కన్నా.. వైసీపీ ఆఫీసును కూల్చడమే ముఖ్యమని భావించిన చంద్రబాబు ప్రజాస్వామ్యవాదా? విధ్వంసకారుడా? అంటూ ట్వీట్ చేశారు. Also Read: జమ్మూ కాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు Super 6 అమలు కన్నా Ycp ఆఫీసు కూల్చడమే ముఖ్యమని భావించిన చంద్రన్న ప్రజాస్వామ్యవాదా?విధ్వంసకారుడా? pic.twitter.com/k7rDQIU7KN — Ambati Rambabu (@AmbatiRambabu) June 22, 2024 #telugu-news #chandrababu-naidu #ysrcp #ambati-rambabu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి