YS Sharmila: బీజేపీతో జగన్ అక్రమ సంబంధం.. షర్మిల సంచలన వ్యాఖ్యలు AP: జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. మీరు చేసిన ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ప్రకటించాలని ప్రశ్నించారు. 5 ఏళ్లు బీజేపితో అక్రమ సంబంధం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. By V.J Reddy 27 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YS Sharmila: కాంగ్రెస్ పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. కాంగ్రెస్ పార్టీ (Congress) ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి?.. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? అని ప్రశ్నించారు. 5 ఏళ్లు బీజేపితో (BJP) అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు...ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం అని అన్నారు. క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా? YSR వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం? అని నిలదీశారు. మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా...రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని అన్నారు. సిద్దం అన్న వాళ్లకు 11మంది భలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు? అని చురకలు అంటించారు. Also Read: జమ్మూలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతి! #ycp #ys-jagan #bjp #ys-sharmila మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి