YS Sharmila: జగన్ హత్యా రాజకీయాలు చేశారు.. అసెంబ్లీలో ఉండాల్సిన వ్యక్తి ఢిల్లీ వెళ్ళడం ఏమిటి ?: షర్మిల

బీజేపీ మన రాష్ట్రంపై చిన్న చూపు చూస్తోందన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. NDRF బలగాలను పూర్తి స్థాయిలో పంపలేదన్నారు. వినుకొండ వ్యక్తిగత హత్యను పొలిటికల్ మర్డర్ అని జగన్ కలరింగ్ ఇస్తున్నారన్నారు. అసెంబ్లీలో ఉండాల్సిన జగన్ ఢిల్లీ వెళ్ళడం ఏమిటని ప్రశ్నించారు.

New Update
YS Sharmila: జగన్ హత్యా రాజకీయాలు చేశారు.. అసెంబ్లీలో ఉండాల్సిన వ్యక్తి ఢిల్లీ వెళ్ళడం ఏమిటి ?: షర్మిల

YS Sharmila: ఏపీపై బీజేపీ (BJP) సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ అధికారంలో ఉన్నా బీజేపీ మన రాష్ట్రంపై చిన్న చూపు చూస్తుందన్నారు. NDRF బలగాలను పూర్తి స్థాయిలో పంపలేదని మండిపడ్డారు. ఒక్క మేలు కాదు కదా అని మోసాలేనని అలాంటి బీజేపీతో బాబు కూటమి గట్టారని అన్నారు.

సబ్సిడీ పథకాలు ఎత్తేశాడు..

YSR తలపెట్టిన జలయజ్ఞం జగన్ (YS Jagan) విస్మరించారని..ప్రాజెక్టు కట్టకపోగా ఉన్నవాటికి మరమత్తులు లేవని.. సబ్సిడీ పథకాలను మొత్తం జగన్ ఎత్తేశాడన్నారు. అప్పు లేని రైతు అంటూ రాష్ట్రంలో లేడని..ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశాడని.. ఇలాంటి రైతుల మీద ఇప్పుడు పడ్డ వానలు మళ్ళీ భారాన్ని మోపాయని అన్నారు. వర్షాలు భారీ ఎత్తున నష్టాన్ని మూట గట్టాయన్నారు. వేసిన పంటలు వేసినట్లే కొట్టుకు పోయాయని.. మళ్ళీ పంటలు వేయలేని పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఇలాంటి రైతులను ఇప్పుడు కూటమి సర్కార్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ఆర్థిక పరిస్థితులపై ఆలోచన చేయాలన్నారు.

రాష్ట్ర విపత్తుగా..

ఈ వర్షాలను రాష్ట్ర విపత్తుగా పరిగణలో తీసుకోవాలని.. ప్రతి రైతుకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. జరిగిన నష్టంపై వెంటనే లెక్కలు వేయాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ (Telangana Congress) 2 లక్షల రుణమాఫీ అమలు చేసిందని.. ఏపీలో కూడా అధికారంలో వచ్చి ఉంటే 2 లక్షల రుణమాఫీ చేసే వాళ్ళమన్నారు. తెలంగాణలో 40 లక్షల మంది రైతులు రుణ విముక్తులు అయ్యారన్నారు. YSR అమలు చేసినట్లే రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు చేశాడన్నారు.

Also Read: నాదెండ్లతో పాటు ఆ జనసేన ఎమ్మెల్యేలకు కీలక పదవులు

రుణమాఫీ ఎందుకు చేయరు?

అయితే, ఏపీలో రైతుల రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదని చంద్రబాబును (Chandrababu Naidu) ప్రశ్నించారు. మీ మ్యానిఫెస్టోలో రుణమాఫీ లేకపోవచ్చు.. కానీ రైతుల కోసం రుణమాఫీ ఎందుకు అమలు చేయరు ? అని నిలదీశారు. అప్పు లేని రైతు రాష్ట్రంలో లేడు కదా..
రాష్ట్రంలో ప్రతి రైతు నెత్తిన కనీసం 2 లక్షల అప్పు ఉందన్నారు. ఏపీ నుంచి 25 మంది ఎంపీలు ఉన్నారని.. అందరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు.. కానీ, ప్రయోజనం శూన్యం అన్నారు. మన ఎంపీలను బీజేపీ వాడుకుంటుందని..  కానీ, ప్రయోజనం మాత్రం ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు.

గుండెలు బాదుకున్నా..

బీజేపీతో యుద్ధం చేసి మన రైతులకు రుణమాఫీ అమలు చేయాలన్నారు. రుణమాఫీ తక్షణం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. రేపు బడ్జెట్ పెడుతున్నారని.. గత 10 ఏళ్లుగా రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదని..అంతా షరా మామూలేనని.. నిధులు కావాలని గుండెలు బాదుకున్నా ప్రయోజనం లేదని అన్నారు. 'ఈ సారి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పారు.. ఏమైనా ప్రయోజనం ఉంటుందా ? పోలవరం పరిస్థితి ఏమిటి..నిధులు ఇస్తారా ? ఇవ్వరా ? రాజధాని పరిస్థితి ఏమిటి ?' అని ప్రశ్నల వర్షం కురిపించారు.

లక్ష కోట్లు కావాలని..

రాజధాని కట్టాలి అంటే 1లక్ష కోట్లు కావాలని.. వైజాగ్ స్టీల్ మీద క్లారిటీ లేదని.. నష్టాల్లో ఉందా అని హేళన చేస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ అని భయపెడుతున్నారు.. ప్రైవేటీకరణ అంటే ఒప్పుకునేది లేదన్నారు. విశాఖ స్టీల్ కి సొంత మైన్స్ కావాలి.. విశాఖ స్టీల్ ను ఆదుకోవాలి.. విశాఖ రైల్వే జోన్ కథ ఏమిటో తెలియదు.. ఎప్పటి వరకు పూర్తి అవుతుందో తెలియదన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుక బడిన ప్రాంతల పరిస్థితి క్లారిటీ ఇవ్వాలన్నారు. లక్ష కోట్లు కావాలని బాబు అడిగాడు..ఏటా 1 లక్ష కోట్లు కేంద్రం ఇస్తే ఎలా సరిపోతుంది? విభజన నాటికి 15 లక్షల కోట్లు కేంద్రం నుంచి ఇవ్వాల్సి ఉందన్నారు.

హోదా ఇస్తారా ? ఇవ్వరా ?..

కడప స్టీల్ పై కేంద్రం క్లారిటీ ఇవ్వాలన్నారు. ప్రతి సారి ప్రత్యేక హోద అంశం అటక ఎక్కుతుందని.. 10 ఏళ్లుగా హోదా మీద పోరాటాలు జరుగుతున్న పట్టింపు లేదన్నారు. 'ఒకప్పుడు మోడీ పై బాబు విమర్శ చేశాడు.. మట్టి కొట్టారు అని బాబు విమర్శ చేశారు.. మరి ఇప్పుడు హోదా మీద ఏం చెప్తారు? హోదా ఇస్తారా ? ఇవ్వరా ? హోదా అనేది రాష్ట్రానికి సంజీవని.. హోదా వస్తేనే రాయితీలు వస్తాయి.. హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయి..హోదా కావాలని బీహార్ వాళ్ళు అడిగితే.. టీడీపీ వాళ్లు హోదా మీద నోరు విప్పడం లేదు.. కనీసం అడగడం కూడా లేదు.. మన ఎంపీలను వాడుకొని బీజేపీ అధికారంలో ఉంది.. హోదా తెచ్చే బాధ్యత బాబు మీద ఉంది..హోదా మీద బాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి'.. ప్రత్యేక హోదా మీద కాంగ్రెస్ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.

గొడ్డలి రాజకీయాలు చేశారు..

ఏది విత్తుతమో అదే కోస్తారు.. జగన్ హత్యా రాజకీయాలు చేశారు.. గొడ్డలి రాజకీయాలు చేశారు.. హత్యా చేసిన వాళ్ళతో బుజాలు రాసుకొని తిరిగారు.. సొంత చెల్లలకు వెన్నుపోటు పొడిచారు.. హోదా మీద బీజేపీ మోసం చేస్తే ఒక్క రోజు ధర్నా చేయలేదు ?
ప్రత్యేక హోదా కావాలని ధర్నా చేయలేదు ? మీ పాలనలో ఎన్ని సార్లు ధర్నాలు చేశారో చెప్పాలి? హోదా అనే అంశం ఊసే లేకుండా చేశారు.. పోలవరం మీద పట్టింపు లేదు.. మూడు రాజధనులకి దిక్కు లేదు.. కార్యకర్త హత్యా మీద ఇప్పుడు డిల్లి ధర్నా అంటున్నారని.. బీజేపీ నిర్లక్ష్యం మీద ఒక్క రోజు ధర్నా చేయలేదని మండిపడ్డారు. వినుకొండ మర్డర్ రాజకీయం కాదు.. వ్యక్తిగత హత్యా.. మా విచారణలో వ్యక్తిగత హత్యా అని తెలిసిందన్నారు. పొలిటికల్ మర్డర్ అని జగన్ కలరింగ్ ఇచ్చారన్నారు.

ఢిల్లీ వెళ్ళడం ఏంటి?

రాష్ట్రంలో వరదలతో రైతుల అల్లాడుతున్నారు. ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది.. అసెంబ్లీలో ఉండాల్సిన మీరు ఢిల్లీ వెళ్ళడం ఏమిటి ? ఇక్కడ అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చ చేయాల్సిన అవసరం లేదా? వినుకొండ మర్డర్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న.. నడి రోడ్డు మీద హత్యలు ఏమిటి?  శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం మీకు లేదా ?  అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బందిపై స్పెషల్ ఫోకస్.. వారి మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని..

Advertisment
Advertisment
తాజా కథనాలు