YouTube : నెమలి కూర వండి వీడియో అప్‌లోడ్ చేశాడు.. చివరికి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్‌ కుమార్‌ అనే వ్యక్తి యూట్యూబ్‌లో నెమలి కూర వండిన వీడియో అప్‌లోడ్ చేశాడు. నెమలి జాతీయ పక్షి కావడంతో అటవీశాఖ అధికారులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

New Update
YouTube : నెమలి కూర వండి వీడియో అప్‌లోడ్ చేశాడు.. చివరికి

Peacock Curry : యూట్యూబ్‌ (YouTube) లో నిత్యం లక్షలాది వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. ప్రస్తుతం నెటీజన్లు రోజులో కొన్ని గంటల పాటు యూట్యూబ్‌లోనే గడుపుతున్నారు. కొందరు యూట్యూబ్ క్రియేటర్లు (YouTube Creators) సైతం దీనినే ఉపాధిగా ఎంచుకుంటున్నారు. అయితే కొంతమంది క్రియేటర్లు చట్టాన్ని ఉల్లంఘించేలా, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పలు వీడియోలు అప్‌లోడ్ చేస్తూ.. అనేక వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా నెమలి కూర ఎలా వండాలో వీడియో చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. నెమలి జాతీయ పక్షి కావడం వల్ల దాన్ని వేటాడి చంపడం, వండటం చట్టారీత్యా నేరం. దీంతో జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: నిర్మాణంలో కైగా పవర్‌ ప్లాంట్.. మేఘా కంపెనీ మరో విపత్తుకు దారి తీస్తుందా ?

ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ప్రణయ్‌ కుమార్‌ అనే వ్యక్తి గత కొంతకాలంగా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి అనే వీడియో అప్‌లోడ్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ టీవీ యూట్యూబ్‌ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలాఉండగా.. 1963లో జనవరి 26న భారత ప్రభుత్వం నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించింది. చట్టం ప్రకారం నెమలిని వేటాడటం, చంపడం నేరం. దీంతో ఏకంగా నెమలి కూర వండి వీడియో అప్‌లోడ్ చేయడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు