Youtube: యూట్యూబ్‌లో వెయ్యికి పైగా ఆ వీడియోలు డిలీట్‌..

ఏఐ సాయంతో కొందరు కేటుగాళ్లు యూజర్లను మోసపూరిత ప్రకటనలతో తప్పుదోవ పట్టించే వీడియోలను యూట్యూబ్‌ గుర్తించింది. అందులో 1000కి పైగా ఉన్న నకిలీ యాడ్‌లను తొలగించింది. తమ పాలసీకి వ్యతిరేకంగా ఉండటం వల్లే దీనిపై చర్యలు తీసుకుంటున్నామని యూట్యూబ్ చెప్పింది.

New Update
YouTube : యూట్యూబ్‌.. భారత్‌కు చెందిన వీడియోలు ఎన్ని తొలగించందంటే

ప్రతిఒక్కరి చేతిలోకి సెల్‌ఫోన్ వచ్చాక ఒక్కరోజు కూడా ఫోన్ వాడకుండా ఎవరూ ఉండలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, యూట్యూబ్‌లలో గంటల పాటు సమయాన్ని గడుపుతున్నారు. ప్రతిరోజూ కనిపించే వీడియోలు, రీల్స్‌లలో కొన్ని ఉపయోగకరంగా ఉంటే మరికొన్ని ఫేక్ వీడియోలు కూడా దర్శనమిస్తాయి. ఇటీవల సెలబ్రిటీలు, పలువురు ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలు వైరల్‌గా మారడం దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Also Read: మూడో ప్రపంచ యుద్ధంపై హెచ్చరించిన చాట్ జీపీటీ..

ప్రముఖుల ఫేక్‌ వీడియోలు

అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో కొందరు కేటుగాళ్లు ఇలా తయారుచేస్తున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ యూజర్లను తప్పుదోవ పట్టించేలా ఉండే మోసపూరిత ప్రకటనల వీడియోలను తొలగించేసింది. సెలబ్రిటీలపై వస్తున్న ఫేక్ వీడియోలపై 404 మీడియా పరిశోధన చేసింది. అయితే అందులో ప్రముఖ సింగర్ టైలర్ స్విఫ్ట్, నటుడు స్టీవ్ హార్వే మరికొందరు ప్రముఖుల వీడియోలు కనిపించాయి.

పాలసీకి వ్యతిరేకం

ఏఐని వినియోగిస్తూ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్న ప్రకటనలకు సంబంధించి.. వెయ్యికి పైగా ఫేక్‌ యాడ్‌లను యూట్యూబ్‌ తీసేసింది. ఈ డీప్‌ఫేక్ వీడియోలను ఇప్పటిదాక 200 మిలియన్ల మంది చూశారు. ఇలా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ సాంకేతికతను వినియోగించి.. కొందరు దుండగులు ఇలా తయారు చేస్తున్న ఫేక్‌ వీడియోలపై యూట్యూబ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో వస్తున్న కంటెంట్ తమ పాలసీకి వ్యతిరేకంగా ఉందని.. అందుకే వీటిపై చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.

Also Read: దేశంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా.. ?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన పుతిన్..!

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ దాడిలో దాడాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. బాధితులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

New Update
putin

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మిని స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌లు స్పందిస్తూ.. తీవ్రంగా ఖండించారు. అలాగే, భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు కూడా దీనిపై విచారం వ్యక్తం చేశారు. పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఉగ్రదాడిలో దాదాపు 28 మంది పర్యాటకులు చనిపోయారు.

Also Read:Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!

పహల్గాం ఉగ్రదాడిపై స్పందించిన  ట్రంప్.. ఈ ఉగ్రదాడి తనను తీవ్రంగా కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. ‘కశ్మీర్ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది. దాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. .గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని ట్రంప్  ట్రూత్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

అటు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించారు. ‘ఈ క్రూరమైన నేరాన్ని సహించేది లేదు. ఈ దాడి వెనకున్న ఎంతటివారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని ఆశిస్తున్నా. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌తో మా సహకారాన్ని మరింత పెంచుకోవడానికి ఎదురుచూస్తున్నాం. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నా" అని పుతిన్ అన్నారు.

భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు కూడా ఈ దాడి గురించి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిని వినాశకర ఉగ్ర దాడిగా అభివర్ణించారు. ‘భారత్‌లోని పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనపై బాధిత కుటుంబాలకు నేను, ఉషా సంతాపం తెలుపుతున్నాం... కొన్ని రోజులుగా మేం ఈ దేశం అందాలు, భారతీయుల అభిమానానికి ఎంతో ముగ్దులయ్యాం.. ఈ భయానక దాడితో చనిపోయివారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తున్నాం’ ఈ మేరకు ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌పై వాన్స్ స్పందించారు.

కశ్మీర్ ఘటనపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. ‘జాతీయ భద్రతా సలహాదారు ద్వారా సమాచారం అందింది. దీనిపై ఎప్పటికప్పుడు అధ్యక్షుడికి సమాచారం అందిస్తున్నాం.. ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం.. దక్షిణ కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతంలో జరిగిన భయానక ఉగ్రదాడిలో 28 మంది  చనిపోగా.. మరో 20 మంది తీవ్రంగా  గాయపడ్డారు. అధ్యక్షుడు ట్రంప్ తక్షణమే ప్రధాని మోదీతో మాట్లాడి ప్రాణాలు కోల్పోయినవారికి తన హృదయపూర్వక సంతాపం తెలియజేస్తారు.

 బాధితులకు, మా మిత్రదేశమైన భారత్‌కు మేము మద్దతుగా నిలుస్తాం.. ఇలాంటి భయానక ఉగ్రవాద దాడులే ప్రపంచంలో శాంతి, స్థిరత కోసం పనిచేస్తున్న మేమందరం మా కృషిని కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి..." అని పేర్కొన్నారు.

జమ్మూ అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలోని బైసరన్‌ లోయలో విహారయాత్రకు వచ్చిన పర్యాటకులే లక్ష్యంగా పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు నిర్వహించే లష్కరే తొయిబా అనుబంధ విభాగం ది రెసిస్టెంట్ ఫ్రంట్ దాడికి పాల్పడింది. ఈ ఈ ఘటనలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇదేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. ఈ ఘటనతో కశ్మీర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also Read: Ap: ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఆయనేనా?

Also Read: J&K TerrorAttack: పహల్గాం ఉగ్రదాడి.. ఇద్దరు ఏపీ వాసులు మృతి !

trump | putin | russia | america | Pahalgam attack | latest-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు