ప్రపంచాన్ని మరో మహమ్మారి కబళించే అవకాశం ఉందని...అందరూ దానికి సంసిద్ధంగా ఉండాలని అంటున్నారు డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయేసస్. అయితే ఈసారి సైన్స్ ప్రయోగాల వల్లనో ఇంక దేని వల్లనే ఈ ముప్పు రాదని..అంటు వ్యాధులే విజృంభిస్తాయని ఆయన చెబుతున్నారు. ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేనప్పటికీ దానికి రెడీగా ఉండాలని ప్రపంచానికి టెడ్రోస్ పిలుపునిచ్చారు. డబ్ల్యూహెచ్‌వో పాండమిక్ అగ్రిమెంట్‌పై జెనీవాలో నిర్వహించిన 13వ పునఃప్రారంభ సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన టెడ్రోస్ కోవిడ్ మహమ్మారిని గుర్తు చేశారు. అప్పుడే పై వ్యాఖ్యలను కూడా చేశారు. ఇప్పుడు మరో మహమ్మారి 20 ేళ్ళ లోపు లేదా అంత కంటే ముందే...ఇంకా చెప్పాలంటే రేపు కూడా మొదలవ్వొచ్చని అన్నారు. ఏది ఏమైనా కచ్చితంగా వచ్చే తీరుతుందని బల్లగుద్ది మరీ చెప్పారు టెడ్రోస్.
నిజానికి 2 కోట్ల మంది..
డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ టెడ్రోస్ కోవిడ్ మహమ్మారి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. అధికారికంగా 70 లక్షల మంది చనిపోయారని ఉంది..కానీ నిజానికి ఆ సంఖ్య 2 కోట్ల వరకూ ఉంటుందని డబ్ల్యూహెచ్ వో అంచనా అని ఆయన చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి 10 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించిందని టెడ్రోస్ తెలిపారు. ఇప్పటివరకు జరిగిన విధ్వంసం మీదనా, రాబోయే మహమ్మారి మీదన కూడా ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
today-latest-news-in-telugu | who | covid
Also read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం