Vizag: విశాఖ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం

విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.విశాఖ న్యూపోర్ట్‌ పరిధిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి యువతి పై కత్తి తో దాడికి దిగాడు.ఈ క్రమంలో అడ్డు వచ్చిన యువతి తల్లి పై కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
Vizag: విశాఖ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం

Vizag Crime: విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అనకాపల్లిలోని రాంబిల్లిలో ప్రేమపేరుతో మైనర్‌ బాలికను చిత్రవధ చేసి హత్య చేసి తానూ బలవన్మరణానికి పాల్పడిన ఘటనను మరువక ముందే.. ఉమ్మడి జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. విశాఖ న్యూపోర్ట్‌ పరిధిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి యువతి పై కత్తి తో దాడికి దిగాడు.

వుడా కాలనీ సమీపంలో నివసించే ఓ యువతిని సిద్దూ అనే యువకుడు గత కొంతకాలం ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. గతంలో కూడా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు మైనర్‌ కావడంతో గాజువాక పోలీసులు పోక్సోచట్టం కింద ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.

అయితే జైలు నుంచి బయటకు వచ్చిన సిద్దూ.. యువతి పై కక్ష గట్టాడు. ఎలాగైనా ఆమెను చంపేయాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన యువతి శ్యామల తల్లి సావిత్రిపై కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. తల్లీ కూతుళ్లు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు పరారీలో ఉండటంతో న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

Also read: సౌత్‌లో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రారంభం..ఎక్కడంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Chandrababu: గురుకులాన్ని సందర్శించిన చంద్రబాబు.. స్టూడెంట్స్ తో ముచ్చట్లు!

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడారు. వంటశాల, భోజనశాలలో పరిశుభ్రతను, సరుకులను పరిశీలించారు.

New Update
Chandrababu Nandigama Tour

Chandrababu Nandigama Tour

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు