AP: ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్లు నమోదు చేయిస్తోంది.. విష్ణువర్ధన్ సంచలన ఆరోపణలు

వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. అందుకే పొరుగు రాష్ట్రాల జనానికి కూడా ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తుందని ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పోటీ చేసేందుకు వైసీపీనుంచి ఎవరూ ముందుకు రావట్లేదని విమర్శలు చేశారు.

New Update
AP: ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్లు నమోదు చేయిస్తోంది.. విష్ణువర్ధన్ సంచలన ఆరోపణలు

Puttaparthi: ఓటమి భయంతో వైసీపీ (ycp) పొరుగు రాష్ట్రాల జనానికి కూడా ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తోందంటూ బీజేపీ (bjp) రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు వర్ధన్ (Vishnu vardhan) రెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు. శ్రీ సత్యసాయి జిల్లాలో పోటీ చేసేందుకు రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ తరఫున ఎవరూ ముందుకు రావట్లేదని, దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థులను అరువు తెచ్చుకుంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ దిగజారుడు రాజకీయాలు..
ఈ మేరకు పుట్టపర్తిలో ప్రజా పోరు పై బీజేపీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ దిగజారుడు రాజకీయాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. 'ఎన్నికలకు ముందే వైసీపీ చేతులెత్తేసింది. ఉద్యోగుల బదిలీ లాగా మా ఎమ్మెల్యేలు తప్పులు చేశారు. మొహం చూపించ లేకున్నారు. ఎమ్మెల్యేలను కూడా మరోచోటకు సీఎం జగన్ బదిలీ చేస్తున్నాడు. ఇంతటి దౌర్భాగ్యం దేశంలో ఎక్కడా లేదు' అన్నారు. అలాగే వైఎస్ జగన్ ఎమ్మెల్యే, ఎంపీల టికెట్ల విషయంలో విడతల వారీగా సినిమా టిక్కెట్లు రిలీజ్ చేసినట్లుగా టికెట్లను విడుదల చేస్తున్నాడని పేర్కొన్నాడు. దీన్ని చూస్తే రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయినట్లు అర్థమవుతుందన్నారు.

ఇది కూడా చదవండి : Rajadhani Files: ‘రాజధాని ఫైల్స్’సినిమా ప్రదర్శన నిలిపివేత.. ఆందోళనకు దిగిన అభిమానులు

పొత్తుల అంశం కేంద్రమే చూసుకుంటుంది..
ఇక రాష్ట్రంలో బీజేపీ పొత్తుల అంశం కేంద్రమే చూసుకుంటుందని చెప్పారు. 175 నియోజకవర్గాల్లోనూ బీజేపీ, జనసేన అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పొత్తులు ఉన్నా లేకున్నా రాష్ట్రంలో బీజేపీ జనసేన ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలుగా ప్రజలకు కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలో వారం రోజుల్లో రాష్ట్రమంతటా ప్రజా పోరు కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు మంత్రులు దోచుకున్న అంశాలను ఛార్జ్ షీట్ రూపంలో ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు